twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘స్పైడర్’ సినిమాపై మహేష్ ‘కత్తి’ పోట్లు!

    స్పైడర్ చూసిన క్రిటిక్ కత్తి మహేష్ విశ్లేషించారు. సినిమా కథ ప్రేక్షకుల సహజానికి పరీక్ష అన్నారు.

    By Bojja Kumar
    |

    'బిగ్ బాస్' రియాల్టీషో ద్వారా పాపులర్ అయిన మహేష్ కత్తి, అంతకంటే ముందే సినీ విశ్లేషకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బిగ్ బాస్ షో మహేష్ కత్తి సమీక్షలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయా సినిమాలపై తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో కొన్ని సార్లు ఆయన హీరోల అభిమానుల నుండి బెదిరింపులు చర్చనీయాంశం అయ్యాయి.

    'బిగ్ బాస్' షోలో పాల్గొని, ఎన్టీఆర్‌కు చాలా క్లోజ్ అయిన మహేష్ కత్తి..... 'జై లవ కుశ' సినిమాపై ఎలాంటి రివ్యూ రాస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అదే సమయంలో 'బిగ్ బాస్' గ్రాండ్ ఫినాలె ఉండటంతో సినిమా చూడకుండా, రివ్యూ రాయకుండా ముంబై వెళ్లిపోయిన మహేష్ కత్తి.... ఆ పరిస్థితి నుండి గట్టెక్కారు.

    స్పైడర్ మీద సమీక్ష

    స్పైడర్ మీద సమీక్ష

    ముంబై నుండి తిరిగి వచ్చిన అనంతరం ‘స్పైడర్' సినిమా చూసిన మహేష్ కత్తి సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన తన రివ్యూలో సినిమా నిరాశపరిచిందని తేల్చి చెప్పారు.

    Recommended Video

    Mahesh Babu Vs NTR Fight over Social Media Movie Reviews
    సూపర్ హీరో సినిమానే కానీ..

    సూపర్ హీరో సినిమానే కానీ..

    స్పైడర్ అనేది ఫోన్ డేటా ఆధారంగా ప్రజలను రక్షించే ఒక సూపర్ హీరో సినిమా. విలన్ ప్రజల ఏడుపులు విని ఆనందించే ఒక సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విలన్‌ను పట్టుకుని, జరుగుతున్న నేరాలను హీరో ఎలా అరికట్టాడనేదే సినిమా.... అని మహేష్ కత్తి తెలిపారు.

    ఐడియా కొత్తగా ఉన్నప్పటికీ

    ఐడియా కొత్తగా ఉన్నప్పటికీ

    వినడానికి ఈ ఐడియా చాలా కొత్తగా అనిపించినప్పటికీ కథ రూపం మాత్రం నిరాశ పరిచే విధంగా ఉందని. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సినిమా అని తెలిపారు.

    అంత బడ్జెట్ ఉన్న ఇలాంటి గ్రాఫిక్సా

    అంత బడ్జెట్ ఉన్న ఇలాంటి గ్రాఫిక్సా

    120 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఆకట్టకోలేదని, అదే సమయంలో పాత్రల పరిధిని ఇరికించినట్టుగా రాసుకోవడం సినిమాకు మైనస్ అయ్యాయని తెలిపారు మహేష్ కత్తి.

    ప్రేక్షకులను సీట్లో కూర్చోబెడతాయి

    ప్రేక్షకులను సీట్లో కూర్చోబెడతాయి

    మహేష్ బాబు కనబర్చిన నటన, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను సీటులో నుంచి లేచి వెళ్లిపోకుండా కూర్చోబెడతాయని మహేష్ కత్తి తెలిపారు.

    ఒక నిరుత్సాహకరమైన

    ఒక నిరుత్సాహకరమైన

    హ్యారిష్ జైరాజ్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈ సినిమాలో ప్రాధాన్యం లేదు. ప్రియదర్శి పులికొండ, ఆర్జే బాలాజీని సరిగా వినియోగించుకోలేదు. మొత్తం మీద ఏఆర్ మురుగదాస్ ఒక నిరుత్సాహకరమైన సినిమాను అందించాడనే చెప్పాలి... అని మహేష్ కత్తి తన సమీక్షలో విశ్లేషించారు.

    English summary
    "Spyder movie concept sounds as great idea disappoints as a story. And as a film, it tests your patience. Bad graphics and restrictive character sketches leave the film half baked. It's Mahesh Babu's screen presence and Santosh Shivan's cinematography that keeps us in seats. Harris Jayraj music is bearable. Rakul has nothing to do in the film. Priyadarshi Pulikonda and RJ Balaji are under utilised. AR Murugadoss delivered an uninspiring film." Mahesh Kathi said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X