For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కోనకు కత్తి ప్రశ్న?: అన్ని మూసుకోమని ఆది కౌంటర్.. ఇక సద్దుమణగదా?

  |

  పవన్ ఫ్యాన్స్-మహేష్ కత్తి మధ్య యుద్దం కాస్త కోన వెంకట్ వైపు టర్న్ తీసుకుంది. పవన్ తరుపున కోన వెంకట్ బరిలోకి దిగడంతో.. ఇప్పుడు మహేష్ కత్తికి ఆయనకు మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. కోన వెంకట్ చెప్పిన డెడ్ లైన్ అయిపోవడంతో తిరిగి వివాదంపై ప్రశ్నించిన కత్తికి కోన నుంచి కౌంటర్ పడింది. దీంతో కత్తి నుంచి కూడ అదే స్థాయిలో మరో ప్రశ్న ఎదురవడం గమనార్హం.

  కత్తి vs కోన: మళ్లీ వార్ మొదలైంది... టాయిలెట్లో మహేష్ కత్తి ఫోటో!

   ఇదీ కోన ట్వీట్:

  ఇదీ కోన ట్వీట్:

  'దురదృష్టవశాత్తు నేను జనవరి 7న చేసిన ట్వీట్‌ తరువాత కూడా నువ్వు ఇదే అంశంపై కొన్ని ఛానెళ్లతో మాట్లాడావు. పవన్‌ కళ్యాణ్‌, అతని అభిమానులను ఎటాక్‌ చేసేందుకు పలు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు. నీ డిక్షనరీలో మౌనానికి మరో అర్థం ఏదన్నా ఉందా?' అంటూ కోన వెకంట్ ట్వీట్ ద్వారా కత్తికి కౌంటర్ ఇచ్చారు.

  మళ్లీ వార్ మొదలైంది... టాయిలెట్లో మహేష్ కత్తి ఫోటో!

  కోనకు కత్తి ప్రశ్న:

  'మీడియా ఛానల్స్‌ చర్చల్లోనూ 15వ తేదీ వరకూ సైలెంట్‌గా ఉండటం గురించే నేను ప్రస్తావించాను. నాపై వచ్చిన అభ్యంతరకరమైన పాట గురించి కూడా నేను మాట్లాడనన్నాను. నా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా జరిగింది. ఓయూ జేఏసీ నా హక్కులు దెబ్బతినకుండా నా పక్కన నిలబడింది. నా వైపు నుంచి అది సైలెన్స్ కాదనుకుంటే.. మరి పీకే ఫ్యాన్స్ సైలెన్స్ మాటేంటి? అని కత్తి గట్టి కౌంటర్ ఇచ్చారు.

  మధ్యలో ఆది..:

  'చానెల్స్ కి వెళ్లి పనికిరాని సోది పెట్టడం ఎందుకు...!?

  నీకంటూ ట్విట్టర్, ఫేస్బుక్‌లు ఉన్నాయి కదా అక్కడ పెట్టి సైలెంట్‌గా ఉంటె ఐపోతుందిగా..
  OU-JAC మొత్తం నీకు సపోర్ట్ ఉన్నట్టు చెప్పుకోకూరయ్య...!
  అన్ని మూసుకొని ఉంటె ఎవడు నిన్ను ఏం అనడు అర్థంచేస్కో' అని జబర్దస్త్ హాస్య నటుడు హైపర్ ఆది మరోసారి కత్తిపై ఘాటు విమర్శలు చేశారు.

  భిన్నాభిప్రాయాలు:

  భిన్నాభిప్రాయాలు:

  ఈ మొత్తం వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మహేష్ కత్తికి మద్దతు తెలుపుతుంటే.. మరికొంతమంది ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో హైపర్ ఆది కామెంట్‌పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెత్త కామెంట్స్‌తో ఓయూ జాక్‌ను రెచ్చగొట్టవద్దని ఓ నెటిజెన్ ఆదిని హెచ్చరించాడు.

   డెడ్ లైన్ అయిపోయిందిగా?..:

  డెడ్ లైన్ అయిపోయిందిగా?..:

  కోన వెంకట్ విధించిన డెడ్ లైన్ పూర్తయిపోవడంతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడటం కష్టమే అనిపిస్తోంది. కేవలం 'అజ్ఞాతవాసి' సినిమా సమయంలో ఎలాంటి రభస లేకుండా చేసేందుకే జనవరి 15వ తేదీ వరకు ఆగాలంటూ కోన వెంకట్ మధ్యలో జోక్యం చేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది.

  English summary
  Mahesh Kathi replied to Writer Kona Venkat through twitter. He questioned 'On channels I metioned about promise to be silent till 15th. I refused to comment on the abusive song made on me and the melecious attempt against my family. OU-JAC stood-up for my rights. If that is not considered SILENCE from my end, where was the silence from PK fans?!?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more