twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ కల్యాణ్‌ను మళ్లీ కెలికిన మహేష్ కత్తి.. ఆయనను వదలను అంటూ కామెంట్!

    By Rajababu
    |

    Recommended Video

    Mahesh Kathi Tweets On Pawan Kalyan

    జనసేన అధినేత, పవరస్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, సినీ విమర్శకుడు మహేష్ కత్తి మధ్య గతకొద్దికాలంగా మాటల యుద్ధం జరుగుతున్నది. కాని కొన్ని రోజులుగా ఈ వార్ ఆగిపోవడంతో పవన్ అభిమానులు ఊపిరిపిల్చుకొన్నారు. అయితే పవన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మహేష్ కత్తి చేసిన ట్వీట్‌పై మరోసారి చర్చనీయాంశమైంది. మహేష్ కత్తి చేసిన ట్వీట్ ఏమిటంటే..

     కత్తి మహేష్ ట్వీట్ ఇదే

    కత్తి మహేష్ ట్వీట్ ఇదే

    హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్. మీ జీవన ప్రయాణానికి సంబంధించిన ఉద్దేశాలు, స్పష్టత, డైరెక్షన్ గురించి మీకు ఈ ఏడాదైనా బోధపడుతుందని భావిస్తున్నాం. మీరు ఈ దేశానికి ప్రధాని కావాలని ఎదురుచూస్తున్నాం అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు.

    పవన్ కల్యాణ్‌పై సెటైరా?

    పవన్ కల్యాణ్‌పై సెటైరా?

    మహేష్ కత్తి చేసిన ట్వీట్‌పై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా పవన్ కల్యాణ్‌ను మాటలతో దెప్పి పొడవటం అన్యాయం. ఈ మధ్యకాలంలో ఇలాంటి సెటైర్ ఎక్కడా చూడలేదు అంటూ కొందరు కామెంట్ చేశారు.

     పవన్‌ కల్యాణ్‌ను వదలను

    పవన్‌ కల్యాణ్‌ను వదలను

    నెటిజన్ల అభ్యంతరాలపై కత్తి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రేమ. అతని వదలను. అతడు ప్రధాని అయితే చూడాలని ఉంది అని మహేష్ అన్నారు. కత్తి మహేష్ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

    మహేష్ కత్తిపై నగర బహిష్కరణ

    మహేష్ కత్తిపై నగర బహిష్కరణ

    కత్తి మహేష్‌పై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. కుల, మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భావించిన తెలంగాణ పోలీసులు కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు విధించిన సంగతి తెలిసిందే.

    English summary
    Mahesh Kathi attacks indirectly Pawan Kalyan. Presently facing charges making derogatory comments against Hindu god. In that occassion, he was facing some action from Telangana police. Now he tweeted a interesting tweet on Pawan Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X