Just In
- 26 min ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 1 hr ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 9 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 11 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
Don't Miss!
- News
రిపబ్లిక్ డే : ఏపీ లేపాక్షి,యూపీ రామ మందిర శకటాలు.. ఈసారి ఢిల్లీ పరేడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్స్ ఇవే
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ పొరపాటున కూడా నా గీత దాటరు
నాకు తెలుసు... మహేష్ బాబుకు ఎంతమంది ఫాన్స్ ఉన్నారో. అమ్మాయిలు ఎంతమంది తనంటే మోజుపడతారో కూడా తెలుసు. అదంతా ఒక నటుడికి దరిచేరే అభిమానులు గానే ఆయన పరిగణిస్తారు. అంతకు మించి గీత దాటరు అంటున్నారు నమ్రత శిరోద్కర్ .మహేష్ జీవిత భాగస్వామి అయిన ఆమె ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే .. అలాగే నా గురించీ ఆయనకు బాగా తెలుసు. బొంబాయిలో సినిమా హీరోయిన్స్ మీద ఎలాంటి గాసిప్స్, లింకప్పులు వస్తాయో ఎవరికీ తెలియనిది కాదు. మా ఇద్దరి మధ్య లవ్ కొనసాగుతున్నంత కాలం మేము అవన్నీ అర్థం చేసుకుని పారదర్శకంగానే గడిపాం. అయితే మా లవ్ ఎఫైర్ ఎప్పుడూ బయట పెట్టడానికి ఆయన ఇష్టపడేవారు కాదు. మీడియా వారు అడిగినప్పుడు కూడా ఆయన అందంగా దాటేసేవారు. ముందు కుటుంబ గౌరవం, ఆ తర్వాత వృత్తి పట్ల ఏకాగ్రత... ఈ రెంటికే ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే మేము 2003లోనే పెళ్లి పట్ల నిర్ణయం తీసుకున్నప్పటికీ 2005లో మాత్రమే ఒక్కటయ్యాం అన్నారు.
ఇక తమ వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ...పెళ్లయిన తర్వాత మహేష్‌లో చాలా మార్పు వచ్చింది. మా తల్లిదండ్రులు త్రీ ఇయర్స్ క్రితం చనిపోయారు. ఆ సంఘటన తర్వాత భార్యాభర్తలుగా మేము మరింత దగ్గరయ్యాం... వెరీ స్ట్రాంగ్‌గా మా పేరెంట్స్ చనిపోయిన కారణంగానే నా సిస్టర్ శిల్ప శిరోద్కర్ కూడా ఫారిన్ నుంచి ఇండియా వచ్చేసింది. తనిప్పుడు సినిమాల్లో కూడా చేయాలనుకుంటోంది అంటూ చెప్పుకొచ్చారుమహేష్‌బాబు ఎంత సూపర్‌స్టారో అందరికీ తెలుసు. స్టార్‌డమ్ అంటే ఆయనకు కూడా ఇష్టమే. కానీ ఆ ఫీలింగ్ ఎక్కడా తను చూపెట్టుకోరు. పొరపాటున కూడా ఆయన విజయాన్ని తలకెక్కించుకోరు. తనెంత సూపర్‌స్టార్ అయినప్పటికీ పార్టీలకు వెళ్ళడం, పేజ్3 జనంతో కలవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే మేము ఇంట్లోనే ఆనందంగా గడుపుతాం అని మురిసిపోతూ చెప్పారు.దూకుడుతో ఉషారుమీద ఉన్న మహేష్ ఇప్పుడు ది బిజెనెస్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పూరీ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ చేస్తోంషది.