»   »  ‘మిర్చి’ దర్శకుడితో మహేష్ బాబు ఓకే, షూటింగ్ డీటేల్స్

‘మిర్చి’ దర్శకుడితో మహేష్ బాబు ఓకే, షూటింగ్ డీటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతోందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో వినిపించిన వార్తలను బట్టి చూస్తే.....ఈ సినిమా తెరకెక్కుతుందో? లేదో? అనే అనుమానాలు ఉండేవి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎట్టకేలకు ఈ చిత్రం ఓకే అయింది. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొరటాల శివ స్క్రీన్ ప్లే వర్క్ మొదలు పెట్టారని సమాచారం. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యుటివి వారు ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. సమ్మర్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రంలో బిజీగా గడుపుతున్నారు. మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో 'దూకుడు' వంటి ఇండస్ట్రియల్ హిట్ ఇచ్చిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఆగడు'. ఈ చిత్రానికి సంబంధించిన బళ్లారి షెడ్యూల్ పూర్తయింది. మార్చి 10 నుండి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభం అయింది.

మహేష్ బాబు తొలిసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీన్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ చరణ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సంకర, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Mahesh Babu will start work for UTV-Koratala Siva film from mid summer. Mahesh has allotted some dates for this film which starts from May and progresses in the following months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu