»   » ‘మహేష్’ ఆడియో ఆవిష్కరణ..(ఫోటోలు)

‘మహేష్’ ఆడియో ఆవిష్కరణ..(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి నిర్మిస్తున్న చిత్రం 'మహేష్'. సందీప్ కిషన్, డింపుల్ చోపడే జంటగా నటిస్తున్నారు. మారుతి సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఆర్.మదన్‌కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోపీ సుందర్ ఈచిత్రానికి సంగీతం అందించారు

ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మంగళవారం జరిగింది. చిత్రంలోని పాటలను భీమినేని శ్రీనివాసరావు, నారా జయశ్రీదేవి, సుదర్శన్ రెడ్డి, ఎంఎల్ కుమార్ చౌదరి, ఎ.ఎస్.రవికుమార్, కొండాలి వెంకటేశ్వరరావు, ఆర్పీ పట్నాయక్, రీచా పనయ్, జెబి, కశీ విశ్వనాథ్ తదితరులు చేతుల మీదుగా శిష్కరించారు.

అల్లనరేష్, నవదీప్, వరుణ్ సందేశ్ ఆడియో సీడీలను, ట్రైలర్లను విడుదల చేసారు. మరిన్ని వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో....

రొమాంటిక్ కామెడీ మూవీ

రొమాంటిక్ కామెడీ మూవీ

ఇదొక రొమాంటిక్ కామెడీ సినిమా. ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో రొటీన్‌కు భిన్నంగా సాగే చక్కటి ఎంటర్‌టైనర్ ఇది. యువతీ యువకులు ఎక్కడో ఒక చోట ఈ చిత్రంలోని పాత్రలతో తమని తాము పోల్చుకుంటారు. పెద్దవారికి తమ తీపి గురుతులను గుర్తుచేసే విధంగా వుంటుంది అంటున్నారు నిర్మాత సురేష్ కొండేటి.

సినిమాకు హైలెట్

సినిమాకు హైలెట్

‘మహేష్' సినిమాకు కథ, కథనాలతో పాటు.... సందీప్ కిషన్ పాత్ర, చిత్రణ హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు యూనిట్ సభ్యులు. హీరోయిన్ డింపుల్ చోపడే అంద చందాలు కూడా సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

మారుతి బ్రాండ్

మారుతి బ్రాండ్

ఈ మధ్య వచ్చే సినిమాలు మారుతి బ్రాండ్ ఉంటే చాలు హిట్టయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కూడా మారుతి బ్రాండ్ ఉండటం చర్చనీయాంశం అయింది. మారుతి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

తమిళంలో హిట్టయింది

తమిళంలో హిట్టయింది

ఇప్పటికే ఈచిత్రాన్ని తమిళంలో ‘యారుడా మహేష్' పేరుతో విడుదల చేసారు. అక్కడ ఈచిత్రం విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు యూనిట్ సభ్యులు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

అసలు ఈచిత్రానికి టైటిలే పెద్ద ప్లస్. ఎందుకంటే ఇప్పటికే మహేష్ పేరుతో ఓ స్టార్ ఉన్నాడు కాబట్టి. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: రానా, సహనిర్మాత: సమన్యరెడ్డి , కథ-స్కీన్‌ప్లే-దర్శకత్వం: ఆర్. మదన్‌కుమార్

English summary
'Mahesh' movie music launched. Suresh Kondeti is producing this film with Sundeep Kishan as the hero and Dimple Chopade as the lead lady. Maruthi will present the film and Samanya Reddy is co-producing it. Madan Kumar is the director and Gopi Sundar scored the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X