»   » మహేష్-మురుగదాస్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే...

మహేష్-మురుగదాస్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కానప్పటికీ షూటింగ్ షెడ్యూల్ రెడీ చేసినట్లు సమాచారం. ఆ షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తయితే దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది.

హేష్, మురగదాస్ కాంబినేషన్ సెట్ అయ్యిన తొలి రోజు నుంచి ఈ సినిమా గురించి రకరకాల ఊహలతో కూడిన కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. తమిళ,తెలుగు మీడియాల రెండింటిలోనూ ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది.

తమిళ మార్కెట్ కోసం మహేష్ చేస్తున్నట్లుగా చెప్పబడుతున్న ఈ చిత్రం ఏ జానర్ లో రూపొందనుంది అనేది ఇప్పుడు కొత్త చర్చనీయాంశం. ఇప్పటివరకూ మీడియాలో ప్రచారమైన వార్తలు ప్రకారం..భారత న్యాయ వ్యవస్ధపై ఈ సినిమా రూపొందుతోందని అన్నారు. అయితే తాజాగా అందుతున్న సమచారం ప్రకారం ఈ సినిమా మురగదాస్ సూపర్ హిట్ తుపాకి తరహాలో సాగుతుందని అంటున్నారు.

Mahesh, Murugadoss movie for diwali

విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకి చిత్రం చూసిన మహేష్ ఆ రేజింలో ఉండాలని మురగదాస్ తో అన్నారని చెప్పుకుంటున్నారు. తమిళ భాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మహేష్ పేవెరెట్ చిత్రాల్లో ఒకటి కావటం విశేషం.

దాంతో మురగదాస్ అలాంటి ధ్రిల్లర్ నేరేషన్ తో సాగే కథతో వచ్చి మహేష్ ఒప్పించాడని చెప్పుతున్నారు. ఏప్రియల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం మహేష్ ఇప్పటివరకూ చేయని కథ,కధనాలతో ఉండబోతోంది.

ఇక ఈ ప్రాజెక్టుకు 80 కోట్లు ఖర్చుపెడుతున్నారట. ఇది మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. విజువల్ గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో ప్రయారిటీ లేదు కానీ భారీగా, రిచ్ గా ఉండాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న బ్రహ్మోత్సవం అనంతరం ఈ చిత్రం ఉండబోతోంది.

English summary
Film Nagar source said that, Mahesh Babu and Murugadoss movie releasing on Diwali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu