»   » ఈ నెలలోనే., అదీ హైదరాబాద్ లోనే.., మహేష్ "భరత్ అను నేను"

ఈ నెలలోనే., అదీ హైదరాబాద్ లోనే.., మహేష్ "భరత్ అను నేను"

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు టాలీవుడ్ సూపర్ హిట్స్ లో ఒకటి అనిపించుకుంది. బాహుబలి దెబ్బకు కూడా తట్తుకొని ఆ టైం లో 100 కోట్లు కొట్టటం అంటే మామూలు విషయం కాదు. ఆ సినిమా తర్వాత మళ్ళీ పర్యావరణం సబ్జెక్ట్ తోనే ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసి ఈ నేపథ్యంలో మహేష్- కొరటాల కాంబోలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఇప్పటికే మురుగదాస్ తో చేస్తున్న స్పైడర్ చివరి దశకు చేరుకోవటం తో ఇప్పుడు భరత్ అను నేను గా కూడా తన వర్క్ మొదలు పెట్టబోతున్నాడు...

మంచి అంచనాలే వున్నాయి

మంచి అంచనాలే వున్నాయి

ప్రస్తుతం ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్న మహేష్ బాబు.. అది పూర్తి కాగానే కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్‌పై ఇరువురి అభిమానుల్లోనూ మంచి అంచనాలే వున్నాయి.

భరత్ అనే నేను

భరత్ అనే నేను

అభిమానుల్లో ఇప్పటినుంచే ఆసక్తి కలిగిస్తున్న ఈ చిత్రానికి 'భరత్ అనే నేను' టైటిల్ ఓకే అయిపోయినట్టే. మహేష్ బాబు తొలిసారిగా తెరపై సీఎంగా కనిపించబోతున్నాడనే వార్త వినగానే.... అసలు కథ ఏ రేంజిలో ఉండబోతోంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

శ్రీమంతుడును మించిన హిట్

శ్రీమంతుడును మించిన హిట్

కొరటాల శివ ఏ స్థాయిలో సినిమాను ప్రజెంట్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శ్రీమంతుడు సినిమాలో... ఊరికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే కాన్సెప్టు హైలెట్ అయినట్లే, ఇందులోనూ అలాంటి ఒక హైలెట్ అయ్యే ఎలిమెంటును కొరటాల శివ చూపించబోతున్నారని, ఈ సినిమాపై మహేష్ బాబు ఎంతో ఎగ్జైట్మెంటుతో ఉన్నారని, తన కెరీర్లో శ్రీమంతుడును మించిన హిట్ ఈసినిమా అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారని అంటున్నారు.

ముఖ్యమంత్రి పాత్రలో

ముఖ్యమంత్రి పాత్రలో

ఇంత వరకూ మహేష్ చేయని ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్‌ నటించే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 22న హైదరాబాద్‌లో మొదలవుతుంది. . ఆ నెలాఖరు వరకు తొలి షెడ్యూల్‌ నిర్వహించి, రెండో షెడ్యూల్‌ను జూన్‌లో మొదలుపెడతారట. ఈ షెడ్యూల్‌లోనే మహేశ్‌ షూటింగ్‌లో జాయిన్ అవుతాడు.

కియారా ఆడ్వాణీ

కియారా ఆడ్వాణీ

ఆగస్ట్‌ షెడ్యూల్‌ లండన్‌లో ఉంటుంది. ఈ చిత్రంతో నాయికగా కియారా ఆడ్వాణీ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆమె హిందీ సినిమా ‘ఎం.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ'లో ధోనీ భార్య సాక్షిగా నటించి అందరి మన్ననలూ పొందారు. ఇప్పుడు మహేశ్‌ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌

దేవిశ్రీ ప్రసాద్‌

కాగా ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే మూడు పాటలకు స్వరాలు కూర్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం లో ఉన్నారట.

English summary
Tollywood Prince Mahesh Babu's next With Koratala shiva "Bharat Anabadu Nenu" Shoot starts from this 22nd
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu