పిల్లలకు షాపింగ్ చేస్తున్న మహేష్
హైదరాబాద్: ఇప్పటికే బాగా లేటవటంతో మహేష్,సుకుమార్ చిత్రం యుద్ద ప్రాతిపదికన పూర్తిచేసేందుకు రెగ్యులర్ షూటింగ్ ..బ్రేక్ లేకుండా చేస్తున్నారు. మహేష్ కూడా ఏ కంప్లైంట్ లేకుండా ఈ షెడ్యూల్ లో రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. లేటవుతోంది..బడ్జెట్ పెరిగిపోతోందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ మార్పు ఫ్యాన్స్ ని ఆనందపరుస్తోంది.
క్రిందటి నెల 18 నుంచి నార్తన్ ఐర్లాండ్, లండన్, యు.కె.లో రెండు నెలల పాటు నిరవధికంగా భారీ షెడ్యూల్‌ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. జూలై 12 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అలాగే వీకెండ్ లలో మహేష్ లండన్ లో తన పిల్లలు కోసం షాపింగ్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం నార్తన్ ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నగరంలో గత కొన్ని రోజులుగా ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడ ఫ్యాన్స్ ...షూటింగ్ ప్లేస్ కు చేరుకుని మహేష్ ని కలిసారు. మహేష్ కూడా చాలా ఉత్సాహంగా వారితో మాట్లాడి,ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం '1' ('నేనొక్కడినే' అని ఉపశీర్షిక). సుకుమార్ దర్శకుడు. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనమ్ హీరోయిన్.
ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్ సర్వత్రా ఆసక్తిని కలిగించిన విషయం తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు. అలాగే గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో మహేష్ పాత్ర చిత్రణ స్టైలిష్‌గా వుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












