For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కుల, వర్గ భేదాల్లేవ్! మహేష్, చెర్రీకి పిలుపు: ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ హీట్!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం 'జనతా గ్యారేజ్' . ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. "ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 12న ఎంతో వైభవం గా శిల్ప కళా వేదిక లో నిర్వహిస్తున్నాం" అని చిత్ర బృందం తెలిపింది.

  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం ఆడియో ను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయటం జరుగుతుంది. దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ : "ఈ చిత్రానికి అభిమానుల నుండి వస్తోన్న సపోర్ట్ మా టీం కి చాలా ఆనందాన్ని ఇస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం", అని తెలిపారు.

  ఈ ఆడియో వేడుకను అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.....అందులో భాగంగా మహేష్ బాబు లేదా రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం. వీరిద్దరికీ ఆహ్వానాలు అందాయని, వీరిలో ఎవరో ఒకరు ఆడియో వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని చిత్రం బృందం అఫీషియల్ గా ఖరారు చేయలేదు.

  ఇప్పుడంతగా లేదు కానీ... ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా కులాలు, వర్గాల పిచ్చి బాగా ఉండేది. అవకాశాల పరంగా కూడా చాలా పక్షపాతం చూపేవారట. ఆయా వర్గాలు తమ తమ హీరోలను సక్సెస్ బాటలో నిలబెట్టడానికి పోటీ పడేవంట. అయితే కాలంతో పాటు కులం పిచ్చి ఉన్న మనుషులు పరిశ్రమలో తగ్గిపోయారు. ఇప్పుడంతా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు.

  మంచి పరిణామం

  మంచి పరిణామం

  ఎన్టీఆర్ సినిమా ఆడియో వేడుకకు మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి వారు ముఖ్య అతిథిగా వస్తున్నారనగనే కొందరు పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఇపుడు పరిస్థితి మారిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  నిర్మాతలు మాట్లాడుతూ..

  నిర్మాతలు మాట్లాడుతూ..

  నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ : "మా బ్యానర్ లో రెండవ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నామన్నారు.

  ఆడియో

  ఆడియో

  ఆగస్టు 12న హైదరాబాద్ లో శిల్ప కళా వేదిక లో ఈ చిత్రం ఆడియో ను విడుదల చేస్తున్నాం . భారీ తారాగణం తో, మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు" అని తెలిపారు నిర్మాతలు.

  ముఖ్య పాత్రలు

  ముఖ్య పాత్రలు

  సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు.

  తెర వెనక

  తెర వెనక

  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. ఫైట్స్ - ఆణల్ అరసు. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ . ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి . నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) రచన - దర్శకత్వం - కొరటాల శివ.

  English summary
  Jr. NTR’s upcoming film Janatha Garage audio launch will be held on 12th August, at Shilpakala Vedika in Hyderabad. From the reports, we heard that Mega Power star Ram Charan is going to grace the event as a special guest.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X