»   » కేక: '1 నేనొక్కడినే' డైలాగ్ టీజర్ (లింక్)

కేక: '1 నేనొక్కడినే' డైలాగ్ టీజర్ (లింక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేశ్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన '1' సినిమా సెన్సార్ సహా అన్ని పనులనూ పూర్తి చేసుకుని ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ చిత్రం కొత్త టీజర్ ని రీసెంట్ గా విడుదల చేసారు. ఈ టీజర్ సూపర్బ్ గా ఉందని ఫ్యాన్స్ అందరూ ఆనందంతో తబ్బిబ్బు అవుతున్నారు.

టీజర్ లింక్...

ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోస్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ "మంచి సినిమా తీశారని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఇంతదాకా ఏ తెలుగు సినిమా విడుదల కానన్ని థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1250 థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1450 నుంచి 1500 థియేటర్లలో '1' వస్తోంది. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్లకూ, ట్రైలర్‌కూ ఊహించనంత స్పందన వచ్చింది. కథ డిమాండ్‌కు తగ్గట్లు అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఈ సినిమా తీశాం.

Mahesh's 1 Nenokkadine - 10 Sec Teaser

ఇందులో మహేశ్ సిక్స్‌ప్యాక్ షాట్స్ ఉండవు. కానీ ఆయన 'టోన్డ్ బాడీ'తో దృఢంగా కనిపిస్తారు. ఇది మహేశ్ తనయుడు గౌతమ్‌కృష్ణ తొలి చిత్రం. ఇందులో మహేశ్ పాత్రకు సంబంధించిన ముఖ్యమైన చిన్ననాటి ఎపిసోడ్ ఉంది. ఆ పాత్రలో గౌతమ్ అసాధారణమైన నటనను ప్రదర్శించాడు. డబ్బింగ్ కూడా సింగిల్ టేక్‌లో చెప్పాడు'' అన్నారు.

రామ్ ఆచంట మాట్లాడుతూ "ఇది సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. 175 పని దినాల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. లండన్‌లో 60 రోజుల చిత్రీకరణ జరిపాం. లండన్‌కు చెందిన సుప్రసిద్ధ నిర్మాణ, పంపిణీ సంస్థ అక్కడ మేం షూటింగ్ జరుపుతున్న విధానం చూసి, ఆశ్చర్యపోయి, మా సినిమాతో అసోసియేట్ అయ్యింది. దాంతో అంతర్జాతీయంగా '1' ఎక్కువ మందికి చేరే అవకాశం కలుగుతోంది. ఈ నెల 10న తెలుగులో విడుదలవడంతో ఈ సినిమా ప్రయాణం ఆగిపోదు. ఆ తర్వాత జర్మనీ, జపనీస్, రష్యన్, కొరియన్ వంటి భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. సూపర్‌స్టార్ పర్ఫార్మెన్స్‌కూ, సుకుమార్ స్క్రీన్‌ప్లేకూ జనం హ్యాట్సాఫ్ చెబుతారు'' అని చెప్పారు.

అనీల్ సుంకర మాట్లాడుతూ "ఇది మూస సినిమా కాదు. తెలుగు సినిమాకి ఇది ఓ కొత్త అనుభవం. కొత్త ట్రెండును సృష్టించే సినిమా. ఇంతదాకా తెలుగులో చూడని ఓ సినిమా చూశామని ప్రతి ఒక్కరూ అంటారు. సూపర్‌స్టార్ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ అని చెబుతారు. ఆయన తెరపై కనిపిస్తున్నంత సేపూ కళ్లార్పకుండా చూస్తుండిపోతారు. టాలీవుడ్‌లో హాలీవుడ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో సుకుమార్ ఈ సినిమాతో చూపించారు. రెండు మూడు రోజుల్లో '1' మూవీ గేమ్‌ను ప్రారంభిస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: ఆర్. రత్నవేలు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary

 1...Nenokkadine starring SuperStar Mahesh is an upcoming Telugu film written, directed by Sukumar.The buzz around 1-Nenokkadine is just going sky-high as the release day is approaching. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu