»   »  దీపావళి గిఫ్టు పంపిన మహేష్ బాబు (ఫోటో)

దీపావళి గిఫ్టు పంపిన మహేష్ బాబు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దీపావళి పండగను సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ చాలా సంతోషంగా జరుపుకున్నారు. పిల్లలతో కలిసి బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అంతే కాకుండా తన సన్నిహితులకు, మిత్రులకు బహుమతులు కూడా పంపారు.

Mahesh's Diwali gifts for friends

ఇలా మహేష్ బాబు నుండి బహుమతులు అందుకున్న వారిలో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని క్రిష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. మహేష్ పంపిన గిఫ్టును ఫోటో తీసి ట్విట్టర్లో పోస్టు చేసాడు. అందులో స్వీట్స్, ఆర్గానిక్ మామిడి పండ్లు, డ్రై ఫ్రూట్స్, వాటితో పాటు మహేష్ స్వయంగా రాసిన పండుగ శుభాకాంక్షల పత్రం కూడా ఉంది.

మహేష్ బాబు, నమ్రతల నుండి తనకు దిపావళి బహుమతులు రావడంపై క్రిష్ సంతోషం వ్యక్తం చేసారు. వారికి థాంక్స్ చెబుతూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. ఇలా మహేష్ బాబు నుండి గిఫ్టులు అందుకున్న వారిలో క్రిష్ తో పాటు కొరటాల శివ, శ్రీను వైట్ల, త్రివిక్రమ్ తదితరులు ఉన్నట్లు సమాచారం.

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్దురుమ్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ క్రిష్. తర్వాత బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ‘గబ్బర్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. మహేష్ బాబుతో కూడా క్రిష్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఈ సినిమా ప్రారంభం కాలేదు. అదే సమయంలోనే అతడికి బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నుండి పిలుపు వచ్చింది. తెలుగులో సూపర్ హిట్టయిన ‘ఠాగూర్' చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ‘గబ్బర్' చిత్రంగా తెరకెక్కింది. అక్షయ్ కుమార్ కెరీర్లో ఈచిత్రం ఎబో యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది.

మహేష్ బాబు, నమ్రత వల్లే తనకు బాలీవుడ్ మూవీ ‘గబ్బర్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కిందని అంటున్నాడు క్రిష్. ఆ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సబీనా ఖాన్ కు తన పేరును రికమండ్ చేసింది నమ్రత, మహేష్ బాబే అంట. ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా వెల్లడించారు.

English summary
Mahesh Babu has been gifting his friends and family members with a bouquet of sweets, organic mangoes, dry fruits, snacks and what not on this Diwali.
Please Wait while comments are loading...