»   »  ‘శ్రీమంతుడు’ : అటు నిర్మాతలు... ఇటు దేవిశ్రీ ప్రసాద్ వివరణ

‘శ్రీమంతుడు’ : అటు నిర్మాతలు... ఇటు దేవిశ్రీ ప్రసాద్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీమంతుడు'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రం ఆడియో విడుదల కోసం సైతం ఫ్యాన్స్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో సాంగ్ లీకైందనే వార్త అందరినీ కలవరపరిచింది.

Mahesh's Srimanthudu rubbishes song leak

అయితే ఈ విషయమై ఈ చిత్రం నిర్మాతలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. వారు పోస్ట్ చేస్తూ... శ్రీమంతుడు పాట లీకైందని తెలిసింది.అయితే మా సినమాలో ది మాత్రం కాదన్నారు. ఆయన ఏమన్నారో ని మీరే స్వయంగా చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Posted by Srimanthudu on 17 June 2015

మరో ప్రక్క సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చిత్రం ఆడియో తేదీ విషయమై ట్వీట్ చేసి వివరణ ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ లో ...శ్రీమంతుడు ఆడియో ... ఈ నెలలోనే విడుదల అవుతుంది. పులి ఆడియో వచ్చే నెలలో విడుదల అవుతుంది. ఏ తేదీ అనేది త్వరలో తెలియచేస్తాం... రెండు లాంగ్వేజ్ లు..ఇద్దరు స్టార్స్... వరస నెలలు అంటూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ మీరూ చూడండి.ఇక సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన శ్రీమంతుడు టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘శ్రీమంతుడు' సినిమా జూలై 17న విడుదలయ్యే అవకాశాలు తక్కువ అని తెలుస్తోంది.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఈ మధ్యే మొదలయ్యాయ్. దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈ నెలలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
English summary
DEVI SRI PRASAD ‏tweeted: " SRIMANTHUDU audio wl be released this month & PULI audio next month !! Dates wil be told soon!! 2 languages 2 Stars 2 consecutive months!!🎹😁"
Please Wait while comments are loading...