»   » వీడియో ‌:అమితాబ్‌ మాటకు మహేశ్‌ బాసట

వీడియో ‌:అమితాబ్‌ మాటకు మహేశ్‌ బాసట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తండ్రిగా కుమార్తె ప్రేమకు నిర్వచనం చెప్పలేనని అదో మధురమైన భావన అని బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. తన కుటుంబంలో కుమారునితో పాటు కుమార్తెకూ పూర్తి స్వాతంత్య్రం ఇచ్చానన్నారు.

అక్టోబర్‌ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోక్‌ స్టూడియోస్‌, ఎంటీవీ సంయుక్త ఆధ్వర్యంలో తండ్రీకూతుళ్ల చేత పాడించిన ప్రేరణ గీతానికి అమితాబ్‌ తన మద్దతు తెలిపారు.

ఐ వాన్నా ఫ్త్లె.. (నాకు ఎగరాలని ఉంది..) అనే ఈ గీతాన్ని జావెద్‌ అఖ్తర్‌ రాయగా బాబుల్‌ సుప్రియో, ఆయన కుమార్తె షర్మీలీ కలిసి పాడారు. ఈ సందర్భంగా అమితాబ్‌ సందేశాన్ని అందిస్తున్న ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు.

mahesh

ఈ వీడియోను టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు షేర్‌ చేస్తూ.. ఓ లెజెండ్‌ ఇచ్చిన సందేశం అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో అమితాబ్‌ కూతుళ్లకు సమాన హోదా ఇవ్వండి అని అభ్యర్థించారు.

English summary
Coke StudioMTV S4 - I Wanna Fly Promo with Sharmilee & Babul Supriyo Supported by Amitabh Bachchan Shared by Mahesh babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu