»   »  మహేష్ ... గజని సూర్య కాంబినేషన్ ?

మహేష్ ... గజని సూర్య కాంబినేషన్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మన తెలుగులో మల్టి స్టార్ ఫిల్మ్స్ బాగా తక్కువ. కారణం జగపతి బాబు తప్ప మిగిలిన మన స్టార్ హీరోలు ఎవరూ వేరొకరి తో కలసి నటించటానికి ముందుకు రాకపోవటమే. కాని మహేష్ బాబు దాన్ని బ్రేక్ చేసే సూచనలు కనపడుతున్నాయి. తాజాగా ఆయన గజని ఫేమ్ సూర్య తో కలిసి తమిళ,తెలుగు భాషల్లో నిర్మితమయ్యే ఓ చిత్రంలో నటించేందుకు సముఖత చూపెడుతున్నారని తెలుస్తోంది. భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ ఈ ప్రపోజల్ తో ముందుకు వచ్చాడుట.

వినాయక్ కి ఎప్పటినుంచో ఈ తరహా సినిమా చేయాలని కోరికట. ఈ చిత్రాన్ని సి.ఎం.కుమారుడు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నిర్మించే అవకాశాలు ఉన్నాయట. ఇంతకు ముందు వినాయక్ దర్శకత్వంలో వచ్చిన యోగి చిత్రం కి నిర్మాతలు వై.యస్ బంధువులే కావటం గమనార్హం. అన్నీ కలసి వస్తే సాథ్యమైనంత త్వరలోనే ఈ ప్రాజెక్టు మెటీరిలైజ్ అయ్యే దశలో చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుడు గా కనిపంచటానికి ముస్తాబు అవుతున్నాడు. వినాయక్ ఎన్టిఆర్ సినిమా లో బిజీగా ఉన్నాడు.

Read more about: mahesh babu surya vinayak y.s.jagan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X