»   » '1', 'ఆగడు' ఫ్లాఫుల గురించి మహేష్ ఇలా...

'1', 'ఆగడు' ఫ్లాఫుల గురించి మహేష్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'1', 'ఆగడు' సినిమాలు నిరాశ పరిచాయి. వాటిపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొన్నారని నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం..? అన్నీ మన చేతుల్లో ఉండవు కదా..? అందుకే 'శ్రీమంతుడు' ఆడియో ఫంక్షన్లో అభిమానులకు 'సారీ' చెప్పా అంటున్నారు మహేష్ బాబు. ఇప్పుడాయన 'శ్రీమంతుడు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈనెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసందర్భంగా మహేష్‌ని పలకరించిన మీడియాతో ఆయన ఇలా స్పందించారు.

మహేష్ కంటిన్యూ చేస్తూ... ప్రతి సినిమా నాకు కీలకమే. నేను చేసిన ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకొంటా. అయితే సినిమా అటూ ఇటూ అయితే పూర్తి బాధ్యత నేనే తీసుకొంటా. ఎందుకంటే కథల ఎంపిక పూర్తిగా నా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఏదైనా చేయాలనుకొంటే.. చేసేస్తా. ఇంకేం ఆలోచించను. ఈ విషయంలో ఎవరి సలహాలూ తీసుకోను... ఎవరి మాటా వినను. అందుకే నా పరాజయాలకు బాధ్యుడ్ని కూడా నేనే అన్నారు.


ప్రయోగాలు గురించి మాట్లాడుతూ... ''నా కెరీర్‌లో ప్రయోగాలు ఎక్కువే. 'నాని' కథ కొత్తగా ఉంటుంది. 'నిజం' కూడా ఆరోజుల్లో రిస్క్‌ చేసి తీసిందే. '1'పై కూడా చాలా ఆశలు పెట్టుకొన్నాం. కానీ వర్కవుట్‌ కాలేదు. అలాగని డీలా పడిపోయలేదు. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోగలిగా. ప్రయోగాల పేరుతో కమర్షియల్‌ విలువలకు దూరంగా వెళ్లకూడదు అన్నారు.


Mahesh talked about Aagadu and '1'

అలాగే...సినిమా అనేది కోట్లతో ముడిపడిన వ్యాపారం. అందుకే పెట్టుబడి మాత్రమే కాదు, రాబడినీ దృష్టిలో ఉంచుకోవాలి. ఇక మీదటా కొత్త కథల్ని ఎంచుకొంటా.. కానీ వాటిలో కమర్షియల్‌ యాంగిల్‌ కూడా ఉంటుంది. అందుకే 'శ్రీమంతుడు' ఓ ఉదాహరణ అనుకోవచ్చు. 'మురారి' తరవాత ఆ తరహా కథ ఎప్పుడు చేస్తారు అని అందరూ అడుగుతున్నారు. 'శ్రీమంతుడు'లో సమాధానం దొరుకుతుంది'' అని చెప్పుకొచ్చారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'శ్రీమంతుడు' విషయానికి వస్తే..


మహేష్ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యూ బై ఏ ధ్రువీకరణ పత్రం పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 7న శ్రీమంతుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


Mahesh talked about Aagadu and '1'

దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు'' అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి,


కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Mahesh talked about his failure movies Aagadu and 1 nenokkadine.
Please Wait while comments are loading...