»   »  నెంబర్ 1 అయ్యినందుకు విషెష్ చెప్పిన మహేష్

నెంబర్ 1 అయ్యినందుకు విషెష్ చెప్పిన మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:భాతదేశపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్‌కు టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ హహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ మొబైల్..ఇండియాలో నెంబర్ వన్ బ్రాండ్ అయినందుకు ఆయన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ ఉత్పత్తుల ప్రచారం నిమిత్తం ప్రిన్స్ మహేష్‌ను ఇంటెక్స్ సంస్థ ఎంచుకుంది. ఈ డీల్ ఏడాది పాటు కొనసాగుతుంది.


టాలీవుడ్ సంచలనంగా నిలిచి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో తమ స్మార్ట్‌ఫోన్‌లకు యువత మరింత కనెక్ట్ అవుతారని ఇంటెక్స్ టెక్నాలజీ డైరెక్టర్ కేశవ్ బన్సాల్ తెలిపారు.

అందుబాటు ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తూ నమ్మకమైన బ్రాండ్‌గా అవతరించిన ఇంటెక్స్‌తో చేతులు కలపటం సంతోషంగా ఉందని మహేష్ అన్నారు.

English summary
Mahesh Babu tweeted:" Congratulations to intexbrand on becoming the no.1 Indian mobile phone brand. wishing you'll a lot more success:)"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu