For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: మహేష్,రామ్ ప్లాన్స్ ఇవే

  By Srikanya
  |

  హైదరాబాద్ : సంవత్సరం చివరకి వచ్చేసింది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ 2015లోకి అడుగుపెడుతూ డిసెంబర్ 31 రాత్రి హంగామా చేయటానికి అందరూ సిద్దమవుతున్నారు. సెలబ్రెటీలు తమ దైన శైలిలో ప్లాన్స్ లు చేసుకుంటున్నారు. దాదాపు మిగతా హీరోలందరూ హైదరాబాద్ లో తమ కుటుంబాలతో లేదా తమ స్నేహితులతో ఎంజాయ్ చేయటానకి ప్లాన్ చేసుకుంటే..మహేష్,రామ్ మాత్రం డిఫెరెంట్ గా ప్లాన్ చేసారు.

  ప్రతీ సంవత్సరం మహేష్ తన కుటుంబం తో కలిసి అబుదాబి వెళ్తున్నారు. నమ్రత, గౌతమ్,సితారలను తీసుకుని ఈ న్యూ ఇయి్ర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం అక్కడికే వెళ్తున్నారేంటి అని అడిగితే...మహేష్ భార్య నమ్రత మాట్లాడుతూ... ' మా పిల్లలు... చిన్నవాళ్లు ...వాళ్ల జెట్ లాగింగ్ తీసుకోలేరు. అందుకే మేము నాలుగైదు గంటల్లో రీచ్ అయ్యే ప్రయాణాలు మాత్రమే పెట్టుకుంటున్నాం. దానికి తోడు గౌతమ్ ... ప్యాట్ బైకింగ్, ఒంటెల మీద ఎక్కి తిరగటం వంటివన్నీ అరేబియా ఎడారిలో చేయటం ఇష్యం ', అన్నారామె.

  రామ్ ఈ న్యూ ఇయిర్ వేడుకలను హ్యాంకాంగ్ లో జరుపుకోనున్నారు. రామ్ మాట్లాడుతూ... ' నేను హ్యాంకాంగ్ కు ఈ సంవత్సరం వెళ్లి అక్కడ ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాను... అక్కడ ఫైర్ వర్క్, పార్టీ ఎట్మాస్మియర్ బాగుంటుంది...అలాగే నా తదుపరి చిత్రం కోసం కాస్ట్యూమ్స్ కూడా కూడా కొనుకుంటాను ' అన్నారు.

  Mahesh to UAE, Ram prefers Hong Kong

  ప్రస్తుతం మహేష్ చేస్తున్న చిత్రం విషయానికి వస్తే...

  'ఆగడు' పూర్తయ్యాక మహేష్‌ సెట్‌కు వెళుతోంది ఇప్పుడే. దాంతో అందరి దృష్టీ ఈ చిత్రంపై ఉంది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాండున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

  ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

  గపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్‌బాబు శైలికి తగిన కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించే బాణీలు ఆకట్టుకొంటాయని నిర్మాతలు చెప్తున్నారు.

  మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

  నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసాము అన్నారు.

  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

  English summary
  T-town is getting ready to welcome 2015 on the night of December 31st. Among the big list of star heroes we have, everyone is chilling out either at work or at their homes in Hyderabad, except Mahesh Babu and Ram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X