»   » అక్టోబర్ 6 నుండి ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్...సంచలనం..!

అక్టోబర్ 6 నుండి ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్...సంచలనం..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దూకుడు షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. బిజినేస్ మ్యాన్ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం తర్వాత మహేష్ ఓ ద్విభాషా చిత్రంలో మణిరత్నం దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమా కథా చర్చల వద్దే ఆగిపోవడంతో మహేష్ తన డేట్స్ దిల్ రాజుకిచ్చాడు.

'కొత్త బంగారు లోకం" దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే మల్టీస్టారర్ లో నటించడానికి మహేష్ అంగీకరించాడు. మహేష్ తో పాటు ఇందులో వెంకటేష్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడు. మొదట లైన్ విని పూర్తి కథతో రమ్మన్న మహేష్ కథంతా విన్నాక ఓకే చెప్పాడని, ఈ చిత్రం అక్టోబర్ కల్లా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.

మల్టీస్టారర్స్ ఏనాడో అంతరించిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ వాటికి ఊపిరిపోసే చిత్రమిది అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్. వెంకటేష్ ల కలయికలో రూపొందే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని సమాచారం..

English summary
The latest buzz going on in the tinsel town is that Telugu cinema ace producer Dil Raju and director Srikanth Addala of Kotta Bangaru Lokam fame met super star Mahesh Babu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu