»   » 'ఆగడు': మహేష్ తో కలిసి రాజేంద్రప్రసాద్( లీకెడ్ ఫొటో)

'ఆగడు': మహేష్ తో కలిసి రాజేంద్రప్రసాద్( లీకెడ్ ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh with his Aagadu father Rajendra Prasad!!
హైదరాబాద్ : మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రంలో మహేష్ కి తండ్రిగా రాజేంద్రప్రసాద్ చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు రీసెంట్ గా షూటింగ్ జరిగింది. అప్పుడు లొకేషన్ లో తీసిన చిత్రం ఇలా బయిటకు లీకై వచ్చింది. రాజేంద్రప్రసాద్ ఇంతకు ముందు అల్లు అర్జున్ చిత్రం జులాయిలో నటించి నవ్వులు పూయించారు. అలాగే మొగుడు చిత్రంలో గోపీచంద్ కి తండ్రిగా చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌, విలన్ గ్యాంగ్ తో ఫైటింగ్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. అనంతరం రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈ నెలాఖరు వరకు అక్కడే చిత్రీకరణ జరుపుతారు. ఏప్రిల్‌ నుంచి గుజరాత్‌లో చిత్రీకరణ ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Rajendra Prasad appearing in Mahesh Babu’s upcoming film Aagadu.If the buzz is to be believed, Rajendra Prasad will be seen as Mahesh Babu’s father in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu