»   » సల్మాన్‌ఖాన్‌కు మహేశ్‌బాబు చుక్కలు.. సుల్తాన్‌తో ప్రిన్స్ ఢీ అంటే ఢీ

సల్మాన్‌ఖాన్‌కు మహేశ్‌బాబు చుక్కలు.. సుల్తాన్‌తో ప్రిన్స్ ఢీ అంటే ఢీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అంటే ఈద్ (రంజాన్) వచ్చినట్లే. ఈద్ వస్తున్నదంటే సల్మాన్ సినిమా వస్తున్నట్టే. ఈద్ కలెక్షన్లు కేవలం సల్లూభాయ్ మాత్రమే. రంజాన్ పండుగ సమయంలో సల్మాన్ కు వ్యతిరేకంగా సినిమా రిలీజ్ చేయాలనే ధైర్యం కూడా ఎవరు చేయరు. కానీ ఈ ఈద్‌కు సల్మాన్‌కు భారీ పోటీ తప్పదు అనే మాట వినిపిస్తున్నది. అయితే ఈ సుల్తాన్‌కు పోటీ ఇచ్చేది మాత్రం ఏ బాలీవుడ్ హీరో అనుకుంటే మాత్రం పొరపాటే. సల్లూభాయ్‌ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నది మన ప్రిన్స్ మహేశ్ బాబు.

సల్మాన్‌తో మహేశ్ ఢీ..

సల్మాన్‌తో మహేశ్ ఢీ..

మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేశ్, సినిమా కబీర్‌ఖాన్ డైరెక్షన్‌లో వస్తున్న ట్యూబ్‌లైట్ ఒకేసారి విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలు ప్రపంచవ్యాపంగా జూన్ 23 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతున్నాయి. రంజాన్ పండుగ (జూన్ 26న)కు ముందే అంటే మూడు రోజుల ముందే ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే ఈ సినిమాలకు కలెక్షన్ల పరంగా లాంగ్ వీకెండ్. ఈ నాలుగు రోజుల్లో వీలైనంత మేరకు కుమ్మేసుకోవచ్చనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

హ్యాట్రిక్ సల్లూభాయ్ రెఢీ

హ్యాట్రిక్ సల్లూభాయ్ రెఢీ

ఈ రంజాన్‌కు ట్యూబ్‌లైట్ చిత్రంతో సల్మాన్ మరోసారి కలెక్షన్లకు జైత్రయాత్రకు సిద్ధమయ్యాడు. సల్మాన్ నటిస్తున్న ఈ సినిమా ఏదో మాస్, మసాలా రొటీన్ సినిమా కాదు. పక్కా భావోద్వేగం ఉన్న కథ. రెండు దేశాల యుద్ద నేపథ్యం ఉన్న స్టోరి. సల్మాన్ తొలిసారి ఆర్మీ జవాన్‌గా నటిస్తున్నారు. ఏక్ థా టైగర్, భజరంగీ భాయ్‌జాన్ చిత్రం తర్వాత హ్యాట్రిక్ కొట్టేందుకు సల్మాన్, దర్శకుడు కబీర్ ఖాన్ జోడి సిద్ధమయ్యారు.

 మహేశ్ ఓవర్సీస్ మార్కెట్ పుంజుకొనే..

మహేశ్ ఓవర్సీస్ మార్కెట్ పుంజుకొనే..

కాగా మహేశ్ బాబు నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. దీంతో మహేశ్‌కు దక్షిణాదిలో మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రిన్స్‌కు ఓవర్సీస్ మార్కెట్ ఎలాంటి ఢోకాలేదు. తమిళంలో కూడా రానుండటంతో మలేషియా, సింగపూర్, యూఎస్, ఇతర దేశాల్లో తెలుగుతోపాటు తమిళంలో కూడా మహేశ్ మార్కెట్ మరింత పుంజుకొనే అవకాశం ఉంది.

ప్రిన్స్ రేంజ్ రెండింతలు

ప్రిన్స్ రేంజ్ రెండింతలు

సల్మాన్ సినిమాకు పోటీగా వస్తున్న ఈ చిత్రం కూడా మహేశ్ కెరీర్‌లోనే ఊహించని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో మహేశ్ వసూళ్ల రేంజ్ రెండింతలు కావడం ఖాయం. ఇదే జరిగితే సల్మాన్ కలెక్షన్లకు భారీగా గండిపడే అవకాశం ఉంది. మహేశ్ ఎంచుకొన్న కథ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్ కావడం మరింత ఆసక్తిని పెంచింది. మహేశ్ ఈ సినిమాలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఫైట్ సీక్వెన్స్‌ను భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో షూట్ చేశారు.

ట్యూబ్‌లైట్‌పై భారీ అంచనాలు

ట్యూబ్‌లైట్‌పై భారీ అంచనాలు

ట్యూబ్‌లైట్ రిలీజ్‌కు ముందే శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడు పోవడం బాలీవుడ్‌లో రికార్డు. ఈ హక్కులను సోని మ్యూజిక్ దక్కించుకొన్నది. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ ఆడియోలో కేవలం మూడే పాటలు ఉండటం గమనార్హం.

సుల్తాన్ రిపీట్

సుల్తాన్ రిపీట్

ట్యూబ్‌లైట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరుగరాసే అవకాశం ఉంది అని ట్రేడ్ అనలిస్టులు ఇప్పటికే విశ్లేషణలు మొదలుపెట్టారు. ఈ చిత్రానికి ముందు సుల్తాన్ సినిమా కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టింది. సుల్తాన్ రిలీజ్ అనంతరం దాదాపు ఏడాది తర్వాత సల్మాన్ సినిమా విడుదలవుతున్నది. సాధారణంగా తొలివారంతంలో మూడు రోజులు సల్మాన్‌కు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి.

లాంగ్ వీకెండ్.. కలెక్షన్లు..

లాంగ్ వీకెండ్.. కలెక్షన్లు..

అయితే ఈ సారి రంజాన్ సోమవారం అంటే జూన్ 26న విడుదల అవుతున్నది. అంటే ఈ సినిమాకు నాలుగు రోజుల వీకెండ్ ఉంటుంది. దాంతో ప్రేక్షకుల తాకిడి ఈ చిత్రానికి ఎక్కువగానే ఉండే అవకాశముందనే చెప్తున్నారు. ప్రతీ ఏడాది ముస్లింలకు ఈద్ వేడుకను దాదాపు వారం రోజులపాటు జరుపుకొంటారు. ఈ వారం రోజుల్లో వారు సల్మాన్, మహేశ్ సినిమాను సినిమాను ఆదరించే అవకాశం ఎక్కువగానే ఉన్నాయి.

సల్మాన్‌కు తొలిసారి టఫ్ ఫైట్

సల్మాన్‌కు తొలిసారి టఫ్ ఫైట్

గత పదేండ్లుగా బాలీవుడ్‌లో సల్మాన్‌కు ఎదురు నిలిచిన చిత్రాలు లేవు. ఫ్లాప్ టాక్ వచ్చినా తొలివారాంతంలోనే కలెక్షన్ల సునామీ నమోదయ్యేది. అలాంటిది భజరంగీ భాయ్‌జాన్ తర్వాత వినూత్న కథతో వస్తున్న సల్మాన్‌కు మహేశ్‌బాబు మాంచి టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. కలెక్షన్ల పరంగా గండి పడే అవకాశం ఉంది.

English summary
First time in bollywood history, Superstar Salman Khan may get tough fight with Prince Maheshbabu. This Eid these superstars ready with their releases. Sultan Salman is gearing with Tubelight, Prnice Mahesh is ready with Murugadoss movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu