చిన్న గొడవ జరిగింది: చక్రి తమ్ముడు నారాయణ
హైదరాబాద్: చక్రి మరణం తెలుగు సంగీత ప్రపంచాన్ని, అభిమానులను విషాదంలో ముంచెత్తింది. అయితే ఆయన మరణం తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. అత్తింటి వేధింపులు అంటూ చక్రి భార్య శ్రావణి హెచ్చార్సీని ఆశ్రయించడమే ఇందుకు కారణం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దీంతో చక్రి కుటుంబంలో అతర్గతంగా ఉన్న గొడవ విషయం బయటకు వచ్చింది. చిన్న గొడవ కారణంగా చక్రి తల్లితో పాటు తమ్ముడు మహిత్ నారాయణ గత కొన్ని రోజులుగా విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. వదిన శ్రావణి హెచ్చార్సీని ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అన్నయ్య చక్రీకి కుటుంబం అంటే చాలా ఇష్టమని, అది మాటలలో చెప్పలేమని, అది చూసినవాళ్లకు మాత్రమే తెలుస్తుందని ఆయన సోదరుడు మహిత్ నారాయణ తెలిపారు. ఇంట్లో చిన్న గొడవ అయిందని నేను అమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశామని, 22 రోజులు నుంచి వేరుగా ఉంటున్నామని చెప్పారు. అన్నయ్య, వదిన కోసమే ఇంట్లో నుంచి వెళ్లిపోయాయని మహిత్ నారాయణ తెలిపారు.
ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సహజమని, మా మధ్య ఎలాంటి విభేధాలు లేవని, మా వదినను ఎవరూ వేధించలేదని నారాయణ స్పష్టం చేశారు. నన్ను దూషించానా వదినపై ఎలాంటి కోపం లేదని ఆయన అన్నారు. మరి అమె ఎందుకు హెచ్చార్సీలో పిర్యాదు చేశారో తెలియదన్నారు. అప్పుడు ఆవేశంలో గొడవ పడ్డాం. ఇపుడు మా మధ్య విబేధాలు ఏమీ లేవు. కుటుంబసభ్యులందరం కూర్చొని సమస్యలపై చర్చించుకుంటామన్నారు.


Click it and Unblock the Notifications











