For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘మజిలీ’ మూవీ ట్విట్టర్ రివ్యూ... ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

  |
  Majili Movie Twitter Review || మజిలీ మూవీ ట్విట్టర్ రివ్యూ || Filmibeat Telugu

  ప్రేమికుల నుంచి భార్య భర్తలుగా ప్రమోట్ అయిన తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించిన తొలి చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌తో పాటు యూఎస్ఏ, పలు ఓవర్సీస్ లొకేషన్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించిన సమంత-చైతూ ప్రేక్షకులను ఆకట్టున్నారా? సినిమా గురించి వారు ఏమంటున్నారు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

  మణిరత్నం మూవీ స్థాయిలో

  మణిరత్నం మూవీ స్థాయిలో

  డైరెక్టర్ శివ రైటింగ్ చాలా మెచ్యూరిటీగా ఉంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ మణిరత్నం సినిమా స్థాయిలో ఉంది. రావు రమేష్, సమంత, చై పెర్ఫార్మెన్స్ ప్రశంసనీయం. ఈ చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నటుడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది.

  ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం

  ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం

  ‘మజిలీ' సినిమా నాకు చాలా నచ్చింది. సమంత, నాగ చైతన్య యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఏమాయ చేశావె సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అయింది. అయినా ఈ జంట మళ్లీ మ్యాజిక్ చేశారు. మజిలీ ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం.

  నాగ చైతన్య కంప్లీట్ యాక్టర్

  నాగ చైతన్య కంప్లీట్ యాక్టర్

  మజిలీ చిత్రంలో నాగ చైతన్యలోని కంప్లీట్ యాక్టర్ కనిపించాడు. సమంతను నాగ చైతన్య ప్రతీ ఫ్రేమలో డామినేట్ చేశాడు. సినిమా చాలా బావుంది.

  అద్భుతంగా తీశారు

  అద్భుతంగా తీశారు

  మజిలీ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. సినిమా స్టోరీ లైన్ సూపర్. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్లు ఆకట్టుకున్నాయి. శివ నిర్వాణ మరోసారి తన గుండెలు పిండేసే స్టోరీతో అదరగొట్టాడు. అందరూ గొప్పగా నటించారు. మ్యూజిక్ బావుంది. తప్పకుండా చూడండి.

  రేటింగ్ 3.5/5

  రేటింగ్ 3.5/5

  మజిలీకి రేటింగ్ 3.5/5 ఇవ్వొచ్చు. తప్పకుండా చూడాల్సిన సినిమా. సమంత నటన సూపర్. పలు ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. చై నటన చాలా బావుంది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్లస్సయింది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ అందించినందుకు శివ నిర్వాణకు థాంక్స్.

  నాగార్జునకు ఏమీ తక్కువ కాదు

  నాగార్జునకు ఏమీ తక్కువ కాదు

  నాగ చైతన్య అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సీన్లలో నాగార్జునకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించాడు. సమంత తన యాక్టింగ్ టాలెంట్ నెక్ట్స్ లెవల్ చూపించింది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంది. మజిలీ ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునే సినిమా.

  మజిలీ రియలిస్టిక్ ఫిల్మ్

  మజిలీ రియలిస్టిక్ ఫిల్మ్

  ఈ మధ్య కాలంలో సినిమాలు ఏదో తీస్తున్నామంటే తీస్తున్నారు. కానీ మజిలీ రియల్ హానెస్ట్ మూవీ. వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ చిత్రం ప్రభావం మనపై తప్పకుండా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంది. ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా.

  ఎమోషనల్ మూవీ

  ఎమోషనల్ మూవీ

  శివ నిర్వాణ తీసిన ‘మజిలీ' చిత్రం చూశాను. లవ్, ఎమోషన్స్ హై రేంజిలో ఉన్నాయి. చై, సామ్ జంట తెరపై అద్భుతంగా కనిపించింది. ఇద్దరూ తమ నటనతో అదరగొట్టారు. వీరు నిజమైన స్టార్స్. సెకండాఫ్‌లో శ్రావణి పాత్ర అద్భుతంగా ఉంది. సమంత పెర్ఫార్మెన్స్ పీక్స్. శివ నిర్వాణ ఎమోషన్స్ బాగా పండించగలిగాడు.

  తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతం

  తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతం

  ఇప్పుడే మజిలీ చూశాను. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. నాగ చైతన్య, సమంత పెర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. నేను ఇచ్చే రేటింగ్ 4/5.

  సమంత నటన కేక

  సమంత నటన కేక

  మజిలీ చిత్రానికి నేనిచ్చే రేటింగ్ 4/5. సమంత నటన ఎమోషనల్ సీన్లలో చాలా చాలా బావుంది. చై సూపర్బ్ పెర్ఫార్మెన్స్. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లింది. శివ నిర్వాణ వండర్ ఫుల్ ఫీల్ గుడ్ మూవీ అందించారు.

  English summary
  Majili Movie twitter review by Audience. "Majili -There is maturity in Shiva’s writing and his shotmaking, visuals and BGM usage are very similar to that of Mani Ratnam. The film feels like an ode to him. Performances by Samantha,Chay, Rao Ramesh are 👏🏼! The guy who played d friend character has a bright future!" Audience tweeted. Shiva Nirvana’s sophomore film Majili, starring Naga Chaitanya, Samantha and Divyansha Kaushik in lead roles releases on April 5 and is one of the most-awaited films to release this summer.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more