For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్‌ అదరకొట్టాడు (మేకింగ్‌ వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పోరుగడ్డకు తిరుగుబాటు నేర్పిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డి. నాటి వర్ధమానపురం, నేటి మహబూబ్‌నగర్‌ జిల్లా వడ్డెమాన్‌ ప్రాంతానికి చెందినవాడు గోనగన్నారెడ్డి. బందిపోటుగా శత్రువుల్ని గడగడలాడించాడు. ఆ పాత్రలో అల్లు అర్జున్‌ నటించిన చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క రుద్రమదేవిగా నటించింది. గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగను పురస్కరించుకొని అల్లు అర్జున్‌కు సంబంధించిన ప్రచార చిత్రాల్ని, మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. దాన్ని మీరూ వీక్షించండి.

  గుణశేఖర్‌ మాట్లాడుతూ ''అల్లు అర్జున్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రాబిన్‌హుడ్‌ తరహాలో అటు యువతరాన్ని, ఇటు చిన్నారుల్ని అలరించేలా గోనగన్నారెడ్డి పాత్రని తీర్చిదిద్దాం. పీటర్‌హెయిన్స్‌ ఆధ్వర్యంలో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

  అలాగే... ''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం హీరోలలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు. ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది. '' అంటూ వివరించారు గుణశేఖర్‌.

  Making Video: Allu Arjun as Gona Ganna Reddy

  ఈ గోన గన్నారెడ్డి పాత్ర ‘రాబిన్‌ హుడ్‌' తరహాలో యువతరాన్ని, పిల్లల్ని విశేషంగా ఆకట్టుకునే రీతిలో సాగుతుంది. పోరుగడ్డకి తిరుగుబాబు నేర్పిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటన చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది. పీటర్‌ హెయిన్స్‌ ఆధ్వర్యంలో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రంగా నిర్మించబడుతోంది.

  ఇళయరాజా, తోటతరణి, నీతాలుల్లా, శ్రీకర్‌ ప్రసాద్‌, పరుచూరి బ్రదర్స్‌, సీతారామశాసి్త్ర, అజయ్‌ విన్సెంట్‌, పీటర్‌ హెయిన్స్‌/విజయ్‌ లాంటి సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రానికి రానా, కృష్ణంరాజు, సుమన్‌, ప్రకాశ్‌రాజ్‌, నిత్యమీనన్‌, కేథరిన్‌, ప్రభ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: ఇళయరాజా, ఫొటోగ్రఫీ: అజయ్‌ విన్సెంట్‌, పాటలు: సీతారామశాస్త్రి, ఫైట్స్‌: విజయ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కె.రామ్‌గోపాల్‌, సమర్పణ: శ్రీమతి రాగిణీగుణ.

  English summary
  Gunasekhar choose the auspicious Sankranthi festival to present the process in which Allu Arjun got into the shoes of Gona Ganna Reddy. A lot of research has been done to design the costumes for the ferocious role of Gona Ganna Reddy. Thanks to Neeta Lulla for making the new avatar of Bunny so memorable for the movie lovers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X