»   » వామ్మో....విడాకుల సెటిల్మెంట్‌కు రూ. 15 కోట్లు అడిగింది, అయినా ఓకే

వామ్మో....విడాకుల సెటిల్మెంట్‌కు రూ. 15 కోట్లు అడిగింది, అయినా ఓకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ నటుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌, మలైకా అరోరా ఖాన్‌ తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరు కౌన్సిలింగ్‌కు కూడా హాజరయ్యారు. అయితే మలైకా విడాకుల సెటిల్మెంట్‌ కోసం రూ. 10-15 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ సమాచారం. అర్బాజ్‌ కూడా నగదు ఇవ్వడానికి అంగీకరించారట.

వీరిద్దరి కుమారుడు అర్హన్‌ ఖాన్‌ ప్రస్తుతం మలైకా దగ్గరే ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల వీరిద్దరు మళ్లీ కలిసి జీవించాలనుకున్నారని, అయితే దీనికి అర్బాజ్‌ సమ్మతించినా, మలైకా ఒప్పుకోలేదని గతంలో పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయంపై అర్బాజ్‌ సోదరుడు సల్మాన్‌ ఖాన్‌ ఎలా స్పందిస్తారో.. అని బాలీవుడ్‌ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.


పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు అర్బాజ్‌, మలైకా ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించారు. తమ 17 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు గతంలో ప్రకటించిన మలైకా దంపతులు విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. .

Malaika Arora demands Rs 10 Crore Settlement from Arbaaz Khan?

మలైకా, అర్బాజ్‌లకు 1998లో వివాహం జరిగింది. వీరిద్దరికి కుమారుడు అర్హాన్‌ ఖాన్‌ ఉన్నాడు. భార్యాభర్తలుగా విడిపోయినా, తల్లిదండ్రులుగా కుమారుడి కోసం ఇద్దరూ కలిసి అండగా నిలుస్తున్నారు.

అందుకే పలు సందర్భాల్లో, కుటుంబ వేడుకల్లో కలిసి కన్పించారు. దీంతో ఇద్దరూ మళ్లీ కలిసి జీవించేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ విడివిడిగా భాగస్వాములను వెతుక్కున్నారని పుకార్లు వస్తున్నాయి. మలైకా అర్జున్‌ కపూర్‌తో సన్నిహితంగా ఉంటోందని, అర్బాజ్‌ గోవాకు చెందిన రెస్టారెంట్‌ ఓనర్‌ ఎల్లో మెహ్రాతో స్నేహం చేస్తున్నాడని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

అర్బాజ్‌కి దూరమైన తర్వాత మలైకా, అర్జున్ కపూర్‌తో సన్నిహితంగా వుంటోందనే వార్తలు ఎక్కువయ్యాయి. దీంతో ఇకనైనా స్పందించకపోతే కష్టం అనుకుందో లేక ఆ తర్వాత ఆలస్యంగా స్పందించినా ఫలితం వుండదు అనుకుందో ఏమో కానీ ఎట్టకేలకు ఈమధ్యే మలైకా అరోరా ఖాన్ ఈ విషయంపై స్పందించింది. అర్జున్ కపూర్ తనకి మంచి మిత్రుడు మాత్రమే. కానీ మామధ్య వున్న స్నేహబంధాన్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు అని వివరించిందామె.

English summary
The news emanating from the crevices in the walls of the Bandra Family Court is that Malaika Arora has asked Rs 10-15 crore from husband Arbaaz Khan as divorce settlement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu