»   » ఫ్యామిలీ కోర్టుకి కౌన్సిలింగ్ కోసం వచ్చారు, విడాకులు నిజమే అని తేల్చారు

ఫ్యామిలీ కోర్టుకి కౌన్సిలింగ్ కోసం వచ్చారు, విడాకులు నిజమే అని తేల్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ జంట అర్బాజ్‌ ఖాన్‌, మలైకా అరోరాలు తమ పదిహేడు సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు వీరిద్దరు ఈ ఏడాది మొదట్లో ప్రకటించారు. ఈ మేరకు విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించిన వీరు కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.

విడాకులకు దరఖాస్తు చేసుకున్న వారు ఆరు నెలలపాటు తప్పనిసరిగా కౌన్సెలింగ్‌ సెషన్స్‌కి హాజరుకావాలి. వివాహబంధాన్ని తిరిగి కొనసాగించే అవకాశాల గురించి ఈ సెషన్స్‌లో చర్చిస్తారు. కౌన్సెలింగ్‌ తర్వాత కూడా ఇద్దరూ కలిసి జీవించేందుకు సుముఖంగా లేరని కోర్టు భావిస్తే వారికి విడాకులు మంజూరు చేస్తుంది.

Malaika Arora Khan, Arbaaz Khan attend first counselling session during divorce proceedings

ఇక వీళ్లిద్దరి విషయానికి వస్తే... మలైకా, అర్బాజ్‌లకు 1998లో వివాహం జరిగింది. వీరిద్దరికి కుమారుడు అర్హాన్‌ ఖాన్‌ ఉన్నాడు. భార్యాభర్తలుగా విడిపోయినా, తల్లిదండ్రులుగా కుమారుడి కోసం ఇద్దరూ కలిసి అండగా నిలుస్తున్నారు. అందుకే పలు సందర్భాల్లో, కుటుంబ వేడుకల్లో కలిసి కన్పించారు.

దీంతో ఇద్దరూ మళ్లీ కలిసి జీవించేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. మరో పక్క ఇద్దరూ విడివిడిగా భాగస్వాములను వెదుక్కున్నారనీరూమర్స్ ...షికార్లు చేస్తున్నాయి. మలైక అర్జున్‌ కపూర్‌తో సన్నిహితంగా ఉంటోందని, అర్బాజ్‌ గోవాకు చెందిన రెస్టారెంట్‌ ఓనర్‌ ఎల్లో మెహ్రాతో స్నేహం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

English summary
Malaika Arora and Arbaaz Khan were spotted outside a Bandra family court. They were there to attend a counselling session as part of the divorce proceedings.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu