వైరల్ అయింది: మహిళలపై లైంగిక హింసపై బాలీవుడ్ బ్యూటీ సంచలన పోస్ట్

నూతన సంవత్సర వేడుక సందర్బంగా ఇటీవల బెంగులూరులో మహిళలపై పలు దారుణ సంఘటనలు చోటు చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ మలైకా అరోరా చేసిన ఓ పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ అయింది.

By Bojja Kumar

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుక సందర్బంగా ఇటీవల బెంగులూరులో మహిళలపై పలు దారుణ సంఘటనలు చోటు చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ మలైకా అరోరా చేసిన ఓ పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ అయింది.

దేశంలో వివిధ సందర్బాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక హింస గురించి ఆమె ఇలా ఓ పోస్టు చేసారు. అమ్మాయిలు కురచ దుస్తులు వేసుకోవడం, డ్రిక్ చేయడం, పార్టీలు చేసుకోవడం విదేశీ కల్చర్ అంటున్నారు... మరి మహిళలపై హింసకు పాల్పడం భారతీయ సంస్కృతా? అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఓ సారి నా స్నేహితురాళ్లతో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ ఉన్న నాగరిక మనుషులు మా మీద పడ్డారు. శరీరాన్ని తడుముతూ నా బట్టల్ని చించేశారు. కానీ, నా రక్షణ నా బాధ్యత.. అందుకే అక్కణ్నుంచి పారిపోయా.

మరోసారి బౌన్సర్లు ఉండే పబ్‌కు వెళ్లా. 'వాళ్లు' అక్కడకూ వచ్చారు. మా వీపులపై, వీపు కింది భాగాలపై తగిలారు. నా రక్షణ నా బాధ్యతే కాబట్టే మళ్లీ అక్కణ్నుంచీ పారిపోయా.

మగవాడి తోడుంటే భద్రత ఉంటుందని నా స్నేహితుడితో కలిసి ఓ సినిమాకు వెళ్లా. తిరిగి బస్‌లో వస్తుండగా.. మళ్లీ 'వాళ్లే'. పదునైన చువ్వలను తీసుకొని నన్ను బెదిరించారు. అయినా నా రక్షణ నా బాధ్యతే.

అందుకే ఈ సారి పద్ధతిగా ఉందామని ఒళ్లంతా కప్పే సల్వార్‌ కమీజ్‌ వేసుకుని కాలేజ్‌కు వెళ్లా. 'వాళ్లు' అక్కడకీ వచ్చారు. దాంతో వాళ్లకు దూరంగా మారుమూల ప్రదేశానికి వెళ్లా అక్కడికీ వాళ్లు వచ్చి నా శరీరాన్నంతా తడిమేశారు. అయినా నా రక్షణ నా బాధ్యతే.

అందుకే బయటకెక్కడికీ వెళ్లకూడదని ఇంట్లోనే ఉండిపోయా. ఈసారి నా బంధువుల రూపంలో వచ్చారు. మా ఇంట్లోనే బెడ్‌ మీద పడేసి హింసించారు. ఎంత జరిగినా నా రక్షణ నా బాధ్యతే కాబట్టి ఈ సారి బాత్రూమ్‌లోకి దూరిపోయా. అయినా సందులోంచి తొంగిచూస్తూనే ఉన్నారు. నా రక్షణ నా బాధ్యత కాబట్టి స్నానం చేయడం కూడా మానేశా. ఇప్పుడు నేనెక్కడ ఉండాలని వారు కోరుకున్నారో సరిగ్గా అక్కడే ఉండిపోయా. తిరిగి కోలుకోలేని విధంగా నా స్ఫూర్తిని 'వాళ్లు' దెబ్బతీశారు.

వాళ్ల దయతో నేనింకా బాత్రూమ్‌లోనే ఉండిపోయా. ఇంతకీ నేనెవరో మీకు తెలుసా? బాత్రూమ్‌ నుంచి బయటకు రానిస్తే.. దేశం కోసం మెడల్స్‌ సాధించగల భారతీయ అమ్మాయిని. అంతరిక్షంలోని వెళ్లగల వ్యోమగామిని. సైన్యంలో చేరి దేశాన్ని కాపాడగలిగే ధీరని. ప్రఖ్యాత కంపెనీలకు మార్గ నిర్దేశం చేయగల సమర్థురాలిని. ప్రపంచాన్నే జయించగలను. అయితే బాత్రూమ్‌ నుంచి బయటకు వస్తేనే ఇవన్నీ చేయగలను. కానీ, నా రక్షణ నా బాధ్యతే కాబట్టి అక్కణ్నుంచి బయటకు రాలేను...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X