»   » ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ హీరోయిన్ ఈవిడే (ఫస్ట్ లుక్)

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ హీరోయిన్ ఈవిడే (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అశ్వినీ దత్ కుమార్తె ప్రియాంక దత్ స్వప్న సినిమా పతాకం నిర్మిస్తున్న చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం' . నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. నాని హీరో. మాళవికా నాయర్‌ హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్ పోస్టర్ ని కొన్ని కోజుల క్రితం విడుదల చేశారు. ఇందులో కేవలం నాని లుక్ మాత్రమే ఉంది.

తాజాగా హీరోయిన్ మాళవిక నాయర్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రంలో ఆమె ఆనంది పాత్రలో కనిపించబోతోంది. తెలుగులో ఆమె నటిస్తున్న తొలి సినిమా ఇదే. మాళవిక నాయర్ ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమా విడుదలైన తర్వాత గానీ చెప్పలేం అమ్మడు సత్తా ఏమిటో..


సినిమా గురించి ప్రియాంక దత్ మాట్లాడుతూ... "సుబ్రహ్మణ్యం ఎవరంటే..? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. నెలకు లక్షల్లో జీతం. అన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డులూ ఉన్నాయి. ఓ మనిషికి గుర్తింపు ఈ అంకెలేనా? కానీ సుబ్రహ్మణ్యం దృష్టిలో ఈ అంకెలే ప్రపంచం. అతని జీవితాన్ని మలుపు తిప్పడానికి ఓ అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరు? ఆ తరవాత ఏమైంది? తెలుసుకోవాలంటే 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా చూడాలి" అంటున్నారు ప్రియాంకాదత్‌.


Malavika Nair as Anandi in Yevade Subramanyam

దర్శకుడు మాట్లాడుతూ... ''ఎవరెస్ట్‌పై తీసిన తొలి భారతీయ సినిమా మాదే. అక్కడ షూటింగ్‌ అనుకొన్నంత సులభం కాదు. మైనస్‌ 10 డిగ్రీల ఉష్టోగ్రత వద్ద చిత్రీకరణ జరిపాం. నేపాల్‌లోని కాఠ్‌మాండూ నుంచి లుక్లా వరకూ విమాన ప్రయాణం. అక్కడి నుంచి ఎడ్ల బళ్లూ, కాలినడకే దారి. దూద్‌ కాశీ వెళ్లడానికి 10 రోజులు పట్టింది. మధ్యమధ్యలో కొన్ని షాట్స్‌ తీసుకొంటూ ప్రయాణం సాగించాం. అక్కడున్న ఇళ్లలో బస చేసేవాళ్లం. వంటింట్లో మంట పెట్టేవారు. అక్కడే చలి కాచుకొనేవాళ్లం. బయట అడుగుపెడితే ఎముకలు కొరికే చలి. ఎలాంటి సౌకర్యాలు లేని చోట పదిహేను రోజులు ఉన్నాం. దూద్‌ కాశీలో ఐదు రోజులు చిత్రీకరణ జరిపాం. ఆ ప్రదేశం చూశాక మేం పడిన కష్టాలన్నీ మాయమైనట్టు అనిపించాయి. నిజానికి ఎవరెస్ట్‌ వెళ్లకుండా ఏ స్విట్జర్ల్లాండ్‌లోనో షూటింగ్‌ జరిపేయొచ్చు. కానీ ఎలాగైనా అక్కడే చేయాలనే పట్టుదలతో వెళ్లాం. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.


ఎవరెస్ట్ బేస్ మెంట్ క్యాంపులో సముద్రమట్టానికి 5300 మీటర్ల ఎత్తులో షూటింగ్ చేశారు. ఈ విషయాన్ని హీరో నానియే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ యంగ్ హీరో నాని ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాడట.సంగీతం: రధన్‌, ఛాయాగ్రహణం: అమిత్‌, భరత్‌.

English summary
After releasing first look and revealing Nani's role with sleek teaser in Yevade Subramanyam, makers have revealed new posters introducing Malavika Nair as Anandi on Thursday.
Please Wait while comments are loading...