»   » సందీప్, చైతూ: రెండు రీమేక్ లు..ఒక చిత్రమైన నిజం

సందీప్, చైతూ: రెండు రీమేక్ లు..ఒక చిత్రమైన నిజం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక దర్శకుడు తీసిన రెండు చిత్రాలు ఒకే సమయంలో రీమేక్ కు వెళ్లటమంటే మాటలు కాదు. ఆ ఘనత దక్కించుకున్న మళయాళ యువ దర్శకుడు ఆల్ఫోన్సే పూతరేన్. ఆ హీరో ... నివిన్ పౌలీ. దర్శకుడు ఆల్ఫోన్సే ఇప్పటివరకూ డైరక్ట్ చేసిన చిత్రాలు రెండు. అవి ప్రేమమ్, నేరం. ఈ రెండు చిత్రాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి.

ఈ మళయాళ డైరక్టర్ కి ఎంత క్రేజ్ తెలుగులో వచ్చిందంటే..తెలుగు హీరోలు తమతో కథలు రెడీ చేసుకోమని ఇతనికి కబుర్లు పంపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నితిన్, అఖిల్ వంటి యంగ్ హీరోలు ఇతనితో చేయాలని ముచ్చటపడుతున్నట్లు సమాచారం.


Also Read: ఏం చేస్తున్నారు?: మన స్టార్ హీరో,హీరోయిన్స్ వ్యానిటి వ్యాన్


‘నేరమ్' ని సందీప్ కిషన్ రీమేక్ చేస్తూంటే, ప్రేమమ్ చిత్రాన్ని నాగచైతన్య హీరోగా రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలు తెలుగులో కూడా బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వీటిని చూసిన వెంటనే హీరోలు మారు మాట్లాడకుండా డేట్స్ ఇచ్చేసారు. ఏముందా ఈ చిత్రాల్లో ఆ ఘనత అంటే...దర్శకుడు నిబద్దతతో చెప్పిన కథనమే అని చెప్పాలి.


Also Read: కొడుకు కోసం తప్పుతుందా?


ఈ రెండు కథలు పరంగా యావరేజ్ గా ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగా అద్బుతమనిపిస్తాయి. రన్ లోలా రన్ చిత్రాన్ని గుర్తు చేసే విదంగా నేరం ఉంటే, మన ఆటోగ్రాఫ్ చిత్రాన్ని గుర్తు చేసే విధంగా ప్రేమమ్ ఉంటుంది. అయితే దర్శకుడు తన దైన శైలిలో మ్యాజిక్ చేసాడు.


Also Read: ట్విట్టర్ టాక్ :నాగ చైతన్య, సమంత సరదా పంచ్ లు


ఇప్పుడీ చిత్రాలు తెలుగు రీమేక్ లు రెగ్యులర్ షూటింగ్ లతో జరుగుతున్నాయి. అంతేకాదు ఈ రెండు చిత్రాలకు సంభందించిన ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసారు. అంటే దాదాపు ఒకేసారి ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయన్నమాట. ఆ ఫస్ట్ లుక్ లు, ఒరిజనల్ లుక్ లు ఒక్కసారి చూద్దాం.


రన్

రన్

సందీప్ కిషన్ చేస్తున్న ‘నేరమ్' ని తెలుగు లో రీమేక్ కి ‘రన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని వదిలారు.


అదిరింది కదూ..

అదిరింది కదూ..

రన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పుడు అభిమానులను అలరిస్తున్నాయి.మళయాళ ఒరిజనల్..

మళయాళ ఒరిజనల్..

ఈ చిత్రం తెలుగు టైటిల్ కోసం భారీగానే అన్వేషనే జరిపారు. ‘123, టైమ్ బాబూ టైమ్, జిందగీ, నాకూ టైమ్ వచ్చింది'లాంటి టైటిల్స్ ని ప్రకటించి అందులోంచి "రన్" ఫెరఫెక్ట్ టైటిల్‌అంటూ ఫిక్స్ చేసాడు.


ఇదీ అర్దం..

ఇదీ అర్దం..

మళయాళంలో "నేరమ్" అంటే కాలమని అర్ధం. సినిమాలో కాలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నందువల్లే తెలుగు చిత్రానికి "రన్" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సందీప్ తెలిపాడు.రన్ డైరక్టర్ మరెవరో కాదు..

రన్ డైరక్టర్ మరెవరో కాదు..

మంచు మనోజ్ తో "మిస్టర్ నూకయ్య" ఫేమ్ అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం.రన్ రిలీజ్ డేట్..

రన్ రిలీజ్ డేట్..

ఈ సినిమా మార్చ్ 23 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదొక డార్క్ కామెడీ చిత్రం.ప్రేమమ్ ఫస్ట్ లుక్

ప్రేమమ్ ఫస్ట్ లుక్

నాగ చైతన్య చేస్తున్న రీమేక్... ఒరిజనల్ ప్రేమమ్ చిత్రం దర్శకుడు తొలి చిత్రం ఇది.ప్రేమమ్ ఒరిజనల్ లుక్...

ప్రేమమ్ ఒరిజనల్ లుక్...

మళయాళంలో ఈ పోస్టర్ తోనే బిజినెస్ మొత్తం జరిగిందని చెప్తారు.కంటిన్యుటీ...

కంటిన్యుటీ...

ఒరిజినల్ వెర్షన్లో హీరో కొన్ని సీన్లలో గడ్డంతో కనిపిస్తాడు. ఇందులో నాగ చైతన్య కూడా అదే లుక్ తో కనిపించబోతున్నారు.శృతి హాసన్ తో...

శృతి హాసన్ తో...

ప్రేమమ్ లో... సాయి పల్లవి లెక్చరర్ పాత్రలో చీరకట్టులో డీసెంటుగా కనిపిస్తుంది. తెలుగు వెర్షన్లో కూడా శృతి హాసన్ అదే లుక్ తో కనిపించబోతోంది.


ఇంతకు ముందు

ఇంతకు ముందు

ప్రేమమ్ తెలుగులో చేస్తున్న దర్శకుడు చందు మొండేటి ఇంతకు ముందు కార్తికేయ చిత్రం డైరక్ట్ చేసారు.


తెలుగు ప్రేమమ్ టీమ్

తెలుగు ప్రేమమ్ టీమ్

నాగచైనత్య, శృతి హాసన్, జీవా, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవింద్‌కృష్ణ, సత్య, కార్తీక్‌ప్రసాద్, నోయల్, ఈశ్వర్‌రావు, జోగినాయుడు, కృష్ణంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: అనల్ అరసు, ఒరిజినల్ స్టోరీ: ఆల్ఫోన్స్ పుథరేన్, సంగీతం: గోపిసుందర్, సమర్పణ: పి.డి.పి.ప్రసాద్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చందు మొండేటి.


English summary
Two interesting projects that have took off in Tollywood are really making many heroes go crazy about this guy named Alphonse Putharen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu