»   » మల్లు మెగాస్టార్ పై వ్యాఖ్యలకు కన్నీళ్ళతో సారీ చెప్తున్నా : ఫ్యాన్స్‌కు హీరోయిన్‌ సారీ

మల్లు మెగాస్టార్ పై వ్యాఖ్యలకు కన్నీళ్ళతో సారీ చెప్తున్నా : ఫ్యాన్స్‌కు హీరోయిన్‌ సారీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అన్నా రాజన్‌ అలియాస్‌ లిచీ.. మళయాలం లో నటించింది రెండు చిత్రాలే అయినా రెండు కూడా హిట్లు కావటంతో మంచి పేరు సంపాదించుకుంది. తాజా చిత్రం వెలిపండిట్‌ పుసక్తంలో మోహన్‌లాల్‌ వైఫ్‌గా నటించి మెప్పించింది కూడా. ఈ క్రమంలోనే యాంకర్‌ లిచీ కన్నా 41 ఏళ్లు పెద్దయిన మమ్ముట్టి ప్రస్తావన తేవటం.. అది కాస్త ఇలా వివాదాస్పదం అయ్యింది.

తీవ్ర వ్యతిరేకత

తీవ్ర వ్యతిరేకత

ఓ టీవీ షోలో జోక్‌గా చేసిన కామెంట్లతో, అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ. చివరికి వారి ఆగ్రహానికి దిగి వచ్చిన అన్నా రాజన్‌, కన్నీరుమున్నీరవుతూ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మెగాస్టార్‌ మమ్ముట్టికి క్షమాపణలు చెప్పింది. ‘మమ్ముట్టి సర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు.

Superstar Mammootty in Manam Malayalam remake with Dulquer Salmaan | Filmibeat Telugu
దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే

దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే

ఎలాంటి కామెంట్లు చేయలేదు. దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే అందులో మమ్ముట్టి.. దుల్కర్‌కు తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు, మమ్మూటీతో కూడా జోడీగా నటించుకుంటున్నట్లు నేను చెప్పాను. కానీ, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు టీఆర్పీ కోసం మొదటి సగం వరకే చూపించారు.

ఇష్టం వచ్చినట్లు తిట్టారు

ఇష్టం వచ్చినట్లు తిట్టారు

ఫలితం నాపై తీవ్ర స్థాయిలో పడింది. అంతా ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వారిద్దరినీ నేను అవమానించేలా మాట్లాడలేదు. క్షమించండి' అని వీడియోలో కోరింది.దుల్కర్‌ సల్మాన్‌, మమ్ముట్టిలతో కలిసి నటించడానికి ఇష్టపడతారా? అని అన్నా రాజన్‌ను ఓ మలయాళం ఛానల్‌ తన టీవీ షోలో ప్రశ్నించింది.

దుల్కర్‌ను హీరోగా ఇష్టపడతాను

దుల్కర్‌ను హీరోగా ఇష్టపడతాను

ఈ ప్రశ్నకు తాను, దుల్కర్‌ను హీరోగా ఇష్టపడతానని, మమ్మూటీ తనకు ఆన్‌-స్క్రీన్‌ తండ్రి పాత్ర పోషిస్తారంటూ కామెంట్లు చేసింది. ఈ వ్యాఖ్యలు మమ్ముట్టి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్‌ మీడియాలో ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోషల్‌ మీడియాలో అభిమానుల ఆగ్రహానికి, అన్నా రాజన్‌ క్షమాపణలు చెప్పింది.

English summary
"I was forced to answer whether I would like to act with Dulquer Salman or Mammootty. I said let me be paired with Dulquer and let Mammootty be the father. I meant Dulquer's father. I even added that I could be paired with Mammootty and Dulquer could act as the father," said Anna Rajan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu