»   »  నటిపై లైంగిక వేధింపులతో లింక్.... నాకు తల్లి, కూతురు ఉందంటూ హీరో వివరణ!

నటిపై లైంగిక వేధింపులతో లింక్.... నాకు తల్లి, కూతురు ఉందంటూ హీరో వివరణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాలం నట(మహాత్మ మూవీ హీరోయిన్) కిడ్నాప్ చేసి కార్లో తిప్పుతూ రెండు గంటల పాటు ఆమెను లైంగికంగా వేధిస్తూ అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు తీసి ఘటనలో కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సునిని అరెస్టు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

ఈ కేసు గురించి కేరళ సీఎం విజయన్ మాట్లాడుతూ...నిందితులు ఎంతటి వారైన వదిలి పెట్టబోమని, ఈ సంఘటన వెనక ఒక వేళ ఎవరైనా హీరో ఉన్నా కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. ఈ కేసును తమ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.

 మళయాల నటుడు దిలీప్ హస్తం ఉన్నట్లు వార్తలు

మళయాల నటుడు దిలీప్ హస్తం ఉన్నట్లు వార్తలు

కాగా... ఈ సంఘటన వెనక మలయాళ సీనియర్ నటుడు దిలీప్ హస్తం ఉన్నట్లు మళయాలం మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో సదరు నటితో దీలిప్ వివాదం ఉందని, ఆ కక్షతోనే ఇదంతా చేయించాడనేది ఆరోపణ.

 స్పందించిన దిలీప్

స్పందించిన దిలీప్

మీడియాలో తనపై వస్తున్న వార్తలకు దిలీప్ ఫేస్‌బుక్‌ ద్వారా వివరణ ఇచ్చారు. మళయాళ నటిపై జరిగిన ఈ సంఘటన చిత్ర పరిశ్రమ సిగ్గుపడేలా చేసిందని, ఆ కేసులో నిందితులతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తనకు ఎలాంటి సంబంధాలూ, పరిచయాలు లేవని దిలీప్ పేర్కొన్నాడు.

 పోలీసులు నన్ను విచారించలేదు

పోలీసులు నన్ను విచారించలేదు

పోలీసులు ఈ కేసుకు సంబంధించి తనను విచారించలేదని తెలిపారు. తనను ఏ పోలీసూ ప్రశ్నించలేదని, తన ఇంటికి వారు మఫ్టీలోగానీ యూనిఫాంలోగానీ రాలేదని స్పష్టం చేశారు. మీడియాలో ఒక వర్గం కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 దమ్ముంటే ఆధారాలు చూపండి

దమ్ముంటే ఆధారాలు చూపండితాను ఒక తల్లి, భార్య, కుమార్తెను కలిగి ఉన్నారు. మహిళలను ఎలా గౌరవించాలో తెలుసు. ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆధారాలు లేకుండా తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారు, అలాంటి వార్తు రాస్తున్న వారు మీడియా సంస్థలు ఒక్క ఆధారాన్ని చూపించాలని దిలీప్ సవాల్ చేశారు.

 వచ్చే నెలలో వివాహం: ఈలోగా హీరోయిన్ మీద దారణం, ఇండస్ట్రీ మొత్తం అండగా!

వచ్చే నెలలో వివాహం: ఈలోగా హీరోయిన్ మీద దారణం, ఇండస్ట్రీ మొత్తం అండగా!

ఓ టీవీ ఛానల్ బయట పెట్టిన వివరాల ప్రకారం....ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో వివరాలు పరిశీలిస్తే సదరు హీరోయిన్ మీద దుండగులు ఎంత క్రూరంగా ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"I am not that actor," Malayalam actor Dileep lashed out at sections of the media, following reports that a young actor-director from Aluva has been questioned by the police in connection with the Malayalam actress molestation case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu