twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ స్టార్‌ను పరిచయం చేసిన లెజండరీ డైరెక్టర్ మృతి

    ప్రముఖ మలయాళ దర్శకుడు ఐవి శశి అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరములు.

    By Bojja Kumar
    |

    మ‌ల‌యాళ సూపర్ స్టార్ మ‌మ్ముట్టిని సినిమా రంగానికి ప‌రిచ‌యం చేసిన లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఐవీ శ‌శి (69) ఇక లేరు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మంగ‌ళ‌వారం ఉద‌యం చెన్నైలో క‌న్నుమూశారు.

    ఐవీ శ‌శి మలయాళంతో పాటు హిందీ, తమిళంలో కూడా చిత్రాలను రూపొందించారు. ఒక మల‌యాళంలోనే ఆయ‌న 150 సినిమాలు తీశారు. ఆయన రూపొందించిన అవులుడే రావుక‌ల్‌ సినిమా అప్పట్లో ఓ సంచలనం. మ‌ల‌యాళంలో ఎ స‌ర్టిఫికేట్ అందుకున్న తొలి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. 1982లో ఆయన తీసిన 'ఆరూదమ్’ సినిమాకు జాతీయ సమైక్యత బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నర్గీస్ దత్ అవార్డ్ అందుకున్నారు.

    Malayalam director I V Sasi dead

    తృష్ణ‌ అనే మలయాళ సినిమా మ‌మ్ముట్టిని చిత్రసీమకు పరిచయం చేసింది ఈ డైరెక్టరే. మరో మలయాళ సూపర్ స్టార్ మోహ‌న్‌లాల్ కు అనేక హిట్ అందించారు శశి. త‌మిళ సూప‌ర్‌స్టార్స్ ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌తో కూడా ఆయ‌న సినిమాలు చేశారు.

    1948లో జన్మించిన శశి తాను రూపొందించిన అవులుడే రావుక‌ల్‌ సినిమాలో నటించిన నటి సీమను పెళ్లాడారు. తర్వాత ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో పని చేశారు. ఈ దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

    English summary
    Renowned Malayalam filmmaker I.V. Sasi passed away on Tuesday in Chennai where he was undergoing treatment. According to media reports, the director breathed his last at his residence in Saligramam. With over 150 films to his credit, Sasi was known for his work in between 1970-2000. He has directed a few Hindi films as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X