»   » ఆయన మల్టీప్లెక్స్ క్లోజ్: అంతటి స్టార్ హీరో కూడా అధ:పాతాళానికి, అభిమానులే "చీ" కొడుతున్నారు

ఆయన మల్టీప్లెక్స్ క్లోజ్: అంతటి స్టార్ హీరో కూడా అధ:పాతాళానికి, అభిమానులే "చీ" కొడుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనప్రియ నాయకన్‌... పీపుల్స్‌ హీరో... నిజ జీవితం లోనూ ఇలాంటి హీరో ఉండాలీ అనిపించుకున్న స్టార్ అతను, లక్షలాది అభిమానులు సినిమాల్లోనే కాదు నిజజీవితం లోనూ మా రోల్ మోడల్ అని చెప్పుకున్నారు, అమ్మాయిలు అతనికి రెండు పెళ్ళిల్లైనా అతన్ని తమ కలల్లోకి ఆహ్వానించారు.. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యింది ఆ హీరో వెనుక ఉన్న భయంకరమైన విలన్ ని చూసి అభిమానులే అసహ్యించుకుంటున్నారు.... అతని పేరు వింటే ఆగ్రహం తో ఊగిపోతున్నారు.. మళయాల పీపుల్స్ హీరో దిలీప్ ఫాల్ డౌన్ ఇంత దారుణం గా ఉంటుందీ అని అతనుకూడా ఊహించలేదేమో....

అరెస్టయ్యాడు

అరెస్టయ్యాడు

దక్షిణాది నటి పై లైంగిక దాడి కేసులో అరెస్టయ్యాడు దిలీప్. ఆరుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దిలీప్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ కేసుకు సంబంధించి నటి ముంజు వారియర్ సోదురుడ్ని పోలీసులు ప్రశ్నించారు. దిలీప్ కు వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాలు నమోదు చేశారు.

అసభ్య ప్రవర్తన కేసులో

అసభ్య ప్రవర్తన కేసులో

దక్షిణాది నటి పైన ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన దౌర్జన్యం, అఘాయిత్యం, అసభ్య ప్రవర్తన కేసులో దిలీప్ అరెస్టయ్యాడు. దిలీప్ పైన సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రముఖ నటుడు కళాభవన్ మణి మృతి కేసుతోను సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

మంజు వారియర్

మంజు వారియర్

ఈ మేరకు కళాభవన్ మణి సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో మంజు వారియర్ వాంగ్మూలాన్ని కూడా సేకరించారు. ఏదన్నా ఒక్క తప్పు జరిగిందంటే చాలు.. అప్పటివరకు చేసిన ఇతర తప్పులన్నీ కూడా ఒకేసారి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మలయాళం స్టార్ హీరో దిలీప్ పరిస్థితి అలాగే ఉంది. ఒక నటిని అపహరించి అత్యాచారం చేయించిన కేసులో మొదటి నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న దిలీప్ ఇప్పుడు ఆలువా జైల్లో ఉన్నాడు. బెయిల్ కూడా దొరకట్లేదు.

కావ్య మాధవన్‌తో అఫైర్

కావ్య మాధవన్‌తో అఫైర్

తన మాజీ భార్యకు ప్రస్తుతం భార్య కావ్య మాధవన్‌తో అఫైర్ విషయాలను వెల్లడించారనే కోపంతో లైంగిక దాడికి గురైన నటిపై ద్వేషం పెంచుకొన్నారనేది ఈ కేసు సారాంశం. ఆమెపై కక్ష పెంచుకొన దిలీప్ భారీ మొత్తంలో డబ్బు పల్సర్ సునీల్, మరికొందరికి డబ్బు ఎరవేసి కిడ్నాప్ చేయించారని, అంతేకాకుండా లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను కూడా తీయించడం జరిగిందనే ఆరోపణలకు సాక్ష్యం దొరకడంతో గత సోమవారం దిలీప్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

నటులు సైతం ఛీకొట్టేలా

నటులు సైతం ఛీకొట్టేలా

ప్రస్తుతం ఆయన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. కస్టడీ విచారణలో పలు విషయాలను దిలీప్ వెల్లడించినట్టు సమాచారం. ఇంతకాలం అతని గురించి గొప్పగా అనుకున్న నటులు సైతం ఛీకొట్టేలా చేసింది. చివరికి అతన్ని మలయాళీ చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా బహిష్కరించే వరకు వచ్చింది.

అభిమానులకు ఆగ్రహం

అభిమానులకు ఆగ్రహం

వివరాల్లోకి వెళ్తే మలయాళ చిత్రసీమను కుదిపేసిన నటిపై అఘాయిత్యం కేసులో దిలీప్‌ ప్రమేయం ఉండటం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. అయితే దిలీప్ ఆస్థులకు భద్రత విషయం సరే ఆయన మీద దెబ్బతిన్న అభిమానం సంగతేమిటీ? దిలీప్ ని తమ హీరో అనుకుని కట్టుకున్న ప్రేమ తాలూకు గోడలు బద్దలయ్యాయి కదా ఆ మానసిక ఆస్తుల కి రక్షణ ఎలా అన్నదానికి సమాధానం చెప్పాల్సింది కాలమే...

దిలీప్ కు చెందిన ఓ భారీ మల్టీప్లెక్సు

దిలీప్ కు చెందిన ఓ భారీ మల్టీప్లెక్సు

మరోవైపు దిలీప్ కు చెందిన ఓ భారీ మల్టీప్లెక్సును మూసివేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు. నిజానికి ఈ కేసుకు, దిలీప్ కు చెందిన సినిమాహాల్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ రోజులు బాగాలేకపోతే ఏదీ కలిసి రాదంటారు కదా.. అలా ఈ బ్యాడ్ టైమ్ లో సినిమా హాల్ కూడా మూతపడబోతోంది.

డి-సినిమాస్ అనే భారీ మల్టీప్లెక్స్

డి-సినిమాస్ అనే భారీ మల్టీప్లెక్స్

కేరళ త్రిచూర్ జిల్లాలోని చాళకుడిలో డి-సినిమాస్ అనే భారీ మల్టీప్లెక్స్ ఉంది. అది దిలీప్ దే. ఆ మల్టీప్లెక్సును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తేల్చారు మున్సిపల్ అధికారులు. ఈ మేరకు థియేటర్లను మూసేయాల్సిందిగా ఈరోజు నోటీసులు అందించబోతున్నారు. ఇప్పటికే సగం ఆదాయాన్ని కోల్పోయిన దిలీప్ కు ఇది మరో ఎదురు దెబ్బ.

English summary
A civic body today decided to issue notice to stop functioning of actor Dileep's multiplex 'D Cinemaas' following alleged violation of rules and guidelines in its construction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu