»   »  సుమంత్ “మళ్ళీ రావా” టీజర్ విడుదల

సుమంత్ “మళ్ళీ రావా” టీజర్ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఆశీస్సులతో..... స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సుమంత్ (హీరోగా),ఆకాంక్ష సింగ్ (బద్రినాద్ కి దుల్హనియా ఫేం) ప్రధాన పాత్రదారులుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా చిత్రం "మళ్ళీ రావా".

"మళ్ళీ రావా" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను ఈరోజు ఉదయం 9 గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ చిత్రoలోని సాంగ్స్ మద్రాస్ లోను, హైదరాబాద్ లోను ప్రముఖ సింగర్స్ తో రికార్డింగ్ జరుపుకుంటున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.


నిర్మాత మాట్లాడుతూ

ఈ సంధర్బంగా చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్క మాట్లాడుతూ మా సంస్థ స్వధర్మ్ ఎంటర్టెన్మెంట్ నుండి వస్తున్నమొదటిచిత్రం ఇది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా రాజోలు, పాలకొల్లు, భీమవరం,హైదరాబాద్,బెంగళూరు పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరిపాము. దర్శకుడికి ఈ సినిమా మొదటి చిత్రం అయినప్పటికీ చాలా బాగా హ్యాండిల్ చేసాడు. సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తాము..అని అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చింది. ఈ మూవీ అందరికీ మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నాను. సుమంత్ గారి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కధను నమ్మి నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు ప్రొడ్యూసర్ రాహుల్ గారికి ,హీరో సుమంత్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను...అని అన్నారు.


నటీనటులు,

నటీనటులు,

సుమంత్ , ఆకాంక్ష సింగ్,అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తీక్ అడుసుమిల్లి, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతీ అస్రాని తదితరులు నటిస్తున్నారు.


సాంకేతిక వర్గం:

సాంకేతిక వర్గం:

ఈ చిత్రానికి D.O.P: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ బరద్వాజ్, ఎడిటింగ్:సత్య గిడుతూరి, లిరిక్స్:కృష్ణ కాంత్ (K.K),ఆర్ట్:మురళి వీరవల్లి,విజువల్ ఎఫెక్ట్స్:రాఘవ. నిర్మాత :రాహుల్ యాదవ్ నక్క, కథ ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరిEnglish summary
Malli Raava Movie Teaser released. The movie starring Sumanth, Akanksha Singh. Ditected by Goutham Thinanuri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu