»   »  యాత్ర: వైఎస్ఆర్ బయోపిక్ అఫీషియల్ ప్రకటన, హీరో ఇతడే...

యాత్ర: వైఎస్ఆర్ బయోపిక్ అఫీషియల్ ప్రకటన, హీరో ఇతడే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఎట్టకేలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర మొదలవుతోంద

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై సినిమా రాబోతోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో వైఎస్ఆర్ రోల్ ఎవరు చేస్తున్నారు? అనే విషయం ఓ కొలిక్కి వచ్చింది. ఈ చిత్రానికి మమ్ముట్టి సైన్ చేసినట్లు నిర్మాతలు అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేశారు.

యాత్ర

యాత్ర

ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో నటించడానికి మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి సైన్ చేయడంతో షూటింగ్ మే నెల నుండి ప్రారంభించడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. ‘యాత్ర' పేరుతో ఈ సినిమా తెరకెక్కబోంది.

మహి వి రాఘవ్ డైరెక్షన్

మహి వి రాఘవ్ డైరెక్షన్

వైఎస్ఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర' కథను దర్శకుడు మహి వి రాఘవ్ స్వయంగా రాసుకుని తెరకెక్కిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

రూ. 30 కోట్లకుపైగా బడ్జెట్

రూ. 30 కోట్లకుపైగా బడ్జెట్

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్ ఎస్టిమేషన్స్‌తో సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 2019 సంక్రాంతిలోపు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అఫీషియల్ స్టేట్మెంట్

అఫీషియల్ స్టేట్మెంట్

చిత్ర నిర్మాతలు విడుదల చేసిన అఫీషియల్ స్టేట్మెంటులో.... వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించబోతున్నట్లు పేర్కొన్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభించి సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు, ‘యాత్ర' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2018 దసరా.... 2019 సంక్రాంతి మధ్యకాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

మమ్మట్టి గురించి నిర్మాతలు

మమ్మట్టి గురించి నిర్మాతలు

మళయాల నటుడు మమ్ముట్టి అద్భుతమైన నటుడు అని, తామను చేస్తున్న ప్రాజెక్టుకు అతడే పర్ఫెక్టుగా సూటవుతాడని తాము నమ్ముతున్నామని, దర్శకుడు మహి వి రాఘవ్ మీద పూర్తి నమ్మకం ఉంది అని నిర్మాతలు తెలిపారు.

English summary
Malayalam superstar Mammootty has officially signed to play the role of late Andhra Pradesh Chief Minister YS Rajasekhar Reddy in his biopic titled Yatra, which will go on floors in May 2018.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X