»   » అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం...’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి

అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం...’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్ హీరో నటించిన 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' సినిమా చూస్తూ ఓ వ్యక్తి మరణించిన సంఘటన సిద్ధిపేటలోని శ్రీనివాస థియేటర్లో చోటు చేసుకుంది. మృతుడు స్థానిక ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఎండి షాదుల్(30) గా గుర్తించారు.

'ఇంట్లో దెయ్యం నాకేం భయం' రివ్యూ

దెయ్యం, హారర్ కాన్సెప్టుతో కూడిన సినిమా కావడంతో....గుండెపోటుతో మరణించినట్లు భావిస్తున్నారు. థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Man Died Inside Theater While Watching 'Intlo Dayyam Nakem Bhayam'

'అల్లరి' నరేష్‌ హీరోగా భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'.

అల్లరి నరేష్‌, కృతిక, రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్‌లతోపాటు మరో 20 మంది ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

English summary
Man Died Inside Theater While Watching 'Intlo Dayyam Nakem Bhayam' in Siddipet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu