»   » బాహుబలి-2 సినిమా చూస్తుండగా విషాదం

బాహుబలి-2 సినిమా చూస్తుండగా విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద హిట్'బాహుబలి-2' సినిమా చూస్తుండగా విషాదంచోటు చేసుకుంది. ఈ సూపర్ హిట్ మూవీని చూసేందుకు వెళ్లి ఓ ప్రేక్షకుడు థియేట‌ర్‌లోనే మృతి చెందాడు.

హైదరాబాద్‌ ఆసిఫ్ నగర్‌లోని అంబా సినిమా హ‌ల్‌కి వచ్చిన ముబషీర్ అహ్మద్‌కి బాహుబ‌లి-2 సినిమా చూస్తుండగానే గుండెపోటు రావ‌డంతో అక్కడిక్కడే మరణించినట్లు సమాచారం.


ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల మోత మ్రోగిస్తూ బాక్సాఫీసు రేసులో దూసుకెళ్లిన మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ బాహుబలి-2 విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. రికార్డు స్థాయిలో దేశ వ్యాప్తంగా 1050 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.


Man dies in cinema while watching Baabhubali 2

కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఎవరూ అందుకోలేని శిఖరాలను అందుకుని యావత్ భారతదేశ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసింది.


బాహుబలి-2 రిలీజ్ ముందు వరకు ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యధిక బాక్సాఫీసు స్కోరు రూ. 700 కోట్లు(పికె) పైచిలుకు మాత్రమే. అయితే ఆ రికార్డును చెరిపేయడంతో పాటు రూ. 1000 కోట్లు, రూ. 1500 కోట్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది.


English summary
A man died in a cinema auditorium while watching a screening of magnum opus movie Baahubali 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu