»   » అర్ధరాత్రి సల్మాన్ అపార్ట్‌మెంట్‌లో కలకలం.. మతిస్థిమితం లేని వ్యక్తి..

అర్ధరాత్రి సల్మాన్ అపార్ట్‌మెంట్‌లో కలకలం.. మతిస్థిమితం లేని వ్యక్తి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్ స్టార్‌ సల్మాన్ ముంబైలో నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు రోజు వేలాది మంది పోటెత్తుతుంటారు. తమ అభిమాన నటుడి దృష్టిలో పడటానికి నానా రకాల ఫీట్లు చేస్తుంటారు. కొందరు హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు. వారిని కట్టడి చేయడానికి భారీగానే బందోబస్తు ఏర్పాటు చేస్తారు. తాజాగా సిబ్బంది లేని సమయంలో ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌లోకి దూరడం వివాదాస్పదమైంది.

టాయిలెట్‌లోకి దూరాడు..

టాయిలెట్‌లోకి దూరాడు..

సిబ్బంది లేని సమయంలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో దూరాడు. టాయిలెట్ గదిలో ఉన్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతను టాయిలెట్‌‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నామని మీడియాకు బంద్రా పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకొన్న వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించామని తెలిపారు.

బాంద్రా నివాసిగా గుర్తింపు

బాంద్రా నివాసిగా గుర్తింపు

అనుమతి లేకుండా సల్మాన్ నివసించే అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన వ్యక్తిని మహ్మద్ సిరాజుద్దీన్‌గా గుర్తించారు. 25 ఏళ్ల వయసు ఉండే సిరాజుద్దీన్ మానసిక స్థితి సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. బంద్రాకు చెందిన వ్యక్తి అని ప్రాథమిక విచారణలో తేలింది. ఇంటరాగేషన్ వివరాలు నమోదు చేసుకొని సిరాజ్‌ను పోలీసులు వదిలిపెట్టారు.

మూత్ర విసర్జన కోసం..

మూత్ర విసర్జన కోసం..

సిరాజుద్దీన్ తన స్నేహితుడితో కలిసి అక్కడికి వచ్చాడు. అతను ఓ మత్తులో కూడా ఉన్నట్టు కనిపించింది. మూత్ర విసర్జన కోసం ఆ ప్రాంతంలో గాలించాడు. ఎక్కడా టాయిలెట్ కనిపించకపోవడంతో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌‌లోకి దూరాడు. సిబ్బంది కూడా లేకపోవడంతో లోనికి వెళ్లడం చాలా సులభమైంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే టాయిలెట్‌లో దూరాడు. అప్పుడే అపార్ట్‌మెంట్ వాసుల దృష్టికి వచ్చింది. వారు కేకలు వేయగా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై సమాచారం అందించారు అని పోలీసులు తెలిపారు.

మతిస్థిమితం లేని వ్యక్తిగా..

మతిస్థిమితం లేని వ్యక్తిగా..

అదుపులోకి తీసుకొన్న వ్యక్తి మతి స్థిమితం బాగాలేదనిపించింది. కొద్దిసేపు విచారించగా అతని పరిస్థితి అర్థమైంది. వివరాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చాం. సిరాజ్ పరిస్థితి చూసి కేసు నమోదు చేయవద్దు అని అనుకొన్నాం. అవసరమైతే మళ్లీ పిలిపించి ప్రశ్నిస్తాం అని బంద్రా పోలీసులు పేర్కొన్నారు.

English summary
Salman Khan is a hit with the masses is widely known, and it is not uncommon to find fans lurking near his apartment building in the hope of catching a glimpse of their favourite actor. Last night, a man entered his building, Galaxy Apartments when the security guard was not around.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu