»   » ఏఎన్ఆర్, నాగ చైతన్య కలిసి మందుకొట్టడం హైలెట్

ఏఎన్ఆర్, నాగ చైతన్య కలిసి మందుకొట్టడం హైలెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నటుడు నాగార్జున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన విషయాలు వెల్లడించారు.

ఈ సినిమా ద్వారా అక్కినేని ఎప్పటికీ జీవించే ఉంటారని నమ్ముతున్నట్లు నాగార్జున చెప్పుకొచ్చారు. సినిమాలో నాన్న, చైతన్య కలిసి మందు కొట్టే సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. కొన్ని సీన్లలో నాన్నను చైతన్య ఒరేయ్ ముసలోడా అంటూ పిలవాల్సి ఉంటుంది. సినిమా షూటింగే అయినప్పటికీ అలా పిలవడానికి చైతన్య బాగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత అతనికి సర్దిచెప్పి నటింపజేసామని నాగార్జున తెలిపారు.

Manam: Highly-awaited Telugu movies of 2014

ఈ సందర్భంగా నాగార్జున అక్కినేనితో గడిపిన చివరి క్షణాలను గుర్తు చేసుకున్నారు. సర్జరీ తర్వాత నాన్న పరిస్థితి విషమిస్తూ వచ్చిందని, అయినా ఆయన చివరి వరకు ధైర్యంగానే ఉన్నారని నాగార్జున తెలిపారు.

మనం చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ పొందింది. తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించి చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.

English summary
Manam is one of the most-talked about and highly-awaited Telugu movies of 2014. The film has created lot of positive buzz in the media and that is due to two main reasons. Firstly, it brings together the three generations stats like Akkineni Nageswara Rao, Nagarjuna and Naga Chaitanya to big screen. Secondly, it is the last movie of late legendary actor ANR, who passed away on January 22, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu