»   »  సానియా మీర్జా వివాదంపై...మంచు లక్ష్మి కామెంట్స్

సానియా మీర్జా వివాదంపై...మంచు లక్ష్మి కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానిమా మీర్జాను కేసీఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం, రూ. కోటి నజరానా ప్రకటించడం తెలిసిందే. సానియా పాకిస్థాన్ వ్యక్తని పెళ్లాడటంతో కొందరు విమర్శలకు తెరలేపారు. ఆ తర్వాత సానియా మీర్జా మీడియాకెక్కడం...తాను చనిపోయే వరకు ఇండియన్‌గానే ఉంటా, ఇండియా తరుపునే ఆడతానంటూ కన్నీరు పెట్టుకోవడం తెలిసిందే.

ఈ వ్యవహారంలో తాజాగా సినీ నటి మంచు లక్ష్మి స్పందించారు. సోనియా మీర్జాపై విమర్శలు చేస్తున్న వారిని ఆమె తప్పు బట్టారు. దేశం తరుపున ఆడుతూ....ఇండియా పేరు నిలబెట్టిన ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు తగవని మంచు లక్ష్మి అభిప్రాయ పడ్డారు. తన పూర్తి మద్దతు సానియా మీర్జాకు ఉంటుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

 Manchu Lakshmi supports Sania Mirza

సానియా పాకిస్తాన్ కోడలు అని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొందరు తన స్థానికత పైన వ్యాఖ్యలు చేయడం బాధించిందన్నారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. తాను భారత్ తరఫున ఆడానని, పెళ్లయ్యాక కూడా భారత్ తరఫునే మెడల్స్ సాధించానని చెప్పారు. తన స్థానికత పైన వచ్చిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటన దేశంలో జరుగుతుందని తాను ఊహించలేదన్నారు.

తాను భారతీయురాలు అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ప్రభుత్వం నుండి అందాల్సిన బకాయిల పైన తాను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో మాట్లాడానని, ఆ సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా అన్నారు.

English summary
"Enough is enough.1st of all we don't give due credit to our sports people & finally when someone is getting some we throw her under the bus. Sania Mirza is TOTALLY deserving of her role as the Brand Ambassador of Telangana. She has brought tennis to light by dedicating her life to it and by playing for india. All the haters pls give urself a break. She will only rise higher. My support to Sania Mirza fulllly. Rock on sister !!" Manchu Lakshmi said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu