»   » కిడ్నాప్ కామెడీ ('దొంగాట' ప్రివ్యూ)

కిడ్నాప్ కామెడీ ('దొంగాట' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. 'అనగనగా ఓ ధీరుడు', 'గుండెల్లో గోదారి', 'వూ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రాల ద్వారా నటిగా గుర్తింపు తెచ్చుకొని... మరోవైపు నిర్మాతగానూ రాణిసున్నారు. ఆమె నటించి, నిర్మించిన చిత్రం 'దొంగాట' ఈ రోజు విడుదలకు సిద్దమవుతోంది. దొంగాట' క్రైమ్‌ కామెడీ జోనర్‌లో సాగిన సినిమా.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇందులో ఓ హీరోయిన్‌ని కొందరు కిడ్నాప్‌ చేస్తారు. అలా ఎందుకు చేశారు? ఎవరు చేశారనే కథాంశంతో ఆసక్తికరంగా సాగుతుంది.మనిషికి డబ్బుకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేప్పే చిత్రమిది. డబ్బుపై వ్యామోహం పెంచుకున్న కొందరు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది చిత్రంలో చెప్తున్నారు.


Manchu Laxmi's Dongata movie preview

మంచు లక్ష్మి మాట్లాడుతూ... 'ఏ' క్లాస్‌ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని సినిమా తీశారా? అని అంతా అడుగుతున్నారు. అదేం కాదు. మా సినిమా అందరూ చూడాలి. అందరికీ నచ్చేలానే తీశాం. తొలిసారి ఇలాంటి జోనర్‌లో ఓ సినిమా చేశా. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో కనిపించా. కామెడీ చేయడం చాలా చాలా కష్టం. మరీ ముఖ్యంగా సెట్లో బ్రహ్మానందం అంకుల్‌ ఉంటే మరింత కష్టం. ఆయనతో తొలిసారి నటించిన చిత్రమిది. నేనైతే చాలా ఆస్వాదిస్తూ పనిచేశా అని చెప్పారామె.


అలాగే...ఇ ఇంతకుముందు ఈ బ్యానర్‌లో గుండెల్లో గోదారి, ఊకొడతారా ఉలిక్కిపడతారా వంటి భారీ చిత్రాలను నిర్మించామని, కానీ మొదటిసారిగా ఎంటర్‌టైన్‌మెంట్ వేలో సాగే చిత్రమిదని, దర్శకుడు వంశీకృష్ణ చిన్నప్పటినుంచి తనకు పరిచయమని చెప్పారు. తను మంచి కథను ఇచ్చాడని, షూటింగ్ కూడా చాలా కూల్‌గా చేస్తున్నామని అన్నారు.. మర్యాదరామన్న ఫేమ్ ప్రభాకర్ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని, తప్పకుండా అతనికి మంచి పేరు వస్తుందన్నారు అన్నారు.


Manchu Laxmi's Dongata movie preview

హీరో అడవి శేషు మాట్లాడుతూ.... ఈ సినిమాలో తాను మొదటిసారి కామెడీ జోనర్‌లో నటిస్తున్న చిత్రమిదని అన్నారు. ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు. కథలో తన పాత్రకున్న ప్రాధాన్యతను గుర్తించి రానా ఇందులో నటించడానికి అంగీకరించారని, పాత్ర చిన్నదే అయినా చిత్ర కథను మలుపు తిప్పుతుందని, అందుకే ఆయన్ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకోవడం జరిగిందని చిత్ర వర్గాలు తెలిపాయి.


అలాగే ...కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం.


బ్యానర్: మంచు ఎంటర్ టైన్ మెంట్
నటీనటులు: మంచు లక్ష్మీ ప్రసన్న, అడివి శేష్‌, మధు నందన్‌, ప్రభాకర్‌, బ్రహ్మానందం తదితరులు
మాటలు :సాయి మాధవ్ బుర్రా
సంగీతం: సత్య మహావీర్‌, రఘు కుంచె, సాయికార్తీక్‌.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం :ఎన్‌.వంశీకృష్ణ
నిర్మాత: మంచు లక్ష్మి
సమర్పణ :విద్యానిర్వాణ
విడుదల తేదీ: 08, మే 2015 (శుక్రవారం)

English summary
Manchu Lakshmi is all set to thrill audience with Donagta. The kidnap drama has shaped out very well and inside reports say that the film will surely enthrall all sections of the audience.
Please Wait while comments are loading...