»   » అదిరింది ఫొటో : మోహన్ బాబు తో సెల్ఫీ

అదిరింది ఫొటో : మోహన్ బాబు తో సెల్ఫీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఎప్పుడూ ఏదో ఒక వార్తలో ఉంటూంటుంది. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో బిజీగా ఉంటూంటుంది. ముఖ్యంగా ఆమెకు తన కుటుంబానికి కూడా పూర్తి ప్రయారిటి ఇస్తూంటుంది. ఆమె తండ్రితో ఆమెకు ఉన్న అనుభంధాన్ని తెలిపే ఈ సెల్ఫీ చూడండి.

స్వీయచిత్రం (సెల్ఫీ) అంటే మంచు లక్ష్మీప్రసన్నకు చాలా ఇష్టం. సమయం చిక్కితే స్మైల్‌ అంటూ సెల్ఫీలు తీసేస్తుంటుంది. ఇదిగో తన తండ్రి మోహన్‌బాబుతో ఓ స్వీయ చిత్రం దిగి ఫేస్‌బుక్‌లో పెట్టింది. ''సరదాలు, సందడి చేయకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు'' అని వ్యాఖ్య కూడా రాసింది లక్ష్మీ మంచు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

We can't stop having fun 󾌬 #fathers #daughter #manchu #Playtime #artists #happy

Posted by Lakshmi Manchu on7 July 2015

గతంలో అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, తదితర చిత్రాల్లో కీలక పాత్రలను పోషించి మంచి మార్కులు కొట్టేసింది. అలాగే ఆమె పోషించిన 'ఐరేంద్రి' అనే పాత్రకు బెస్ట్ విలన్‌గా నంది అవార్డును సైతం అందుకుంది.

Manchu Laxmi selfie with her father

నిర్మాతగా, యాంకర్‌గా రాణిస్తూనే నటీగానూ తనను తానూ ప్రూవ్ చేసుకుంటోంది. పెద్ద దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో 'కడల్' లోనూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'దొంగల ముఠా' లోనూ చేసింది.

తాజాగా ఆమె నిర్మాతగా, నటిగా చేసిన దొంగాట చిత్రం విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే కలెక్షన్స్ కూడా బాగున్నాయని సమాచారం. దాంతో ఆమె చాలా చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన తర్వాత హిట్టై,డబ్బులు తెచ్చి పెడుతున్న సినిమా ఇదే అని చెప్పాలి.

English summary
laxmi manchu share this photo with this caption : "We can't stop having fun😘‪#‎fathers‬ ‪#‎daughter‬ ‪#‎manchu‬ ‪#‎Playtime‬ ‪#‎artists‬ ‪#‎happy‬"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu