»   » అన్నయ్య అన్యాయం చేస్తున్నాడు (ఇంటర్వ్యూలో మంచు మనోజ్)

అన్నయ్య అన్యాయం చేస్తున్నాడు (ఇంటర్వ్యూలో మంచు మనోజ్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: కరెంట్ జనరేషన్లో కరెంటు తీగలాంటి ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్. యాక్టింగుతో పాటు స్టంట్స్, డాన్స్, సింగింగ్, రైటింగ్ వంటి మల్టిపుల్ టాలెంట్స్‌తో తన ప్రత్యేకతను ప్రకటించుకుంటుండే మంచు మనోజ్ ఇకపై కేవలం కేవలం నటనపై మాత్రమే దృష్టి పెడతానంటున్నాడు.

  మే 20న మంచు మోజ్ పట్టినరోజు. ఈ సందర్భంగా మనోజ్ తన తాజా సినిమా కరెంటు తీగ గురించి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనపలు ఆసక్తిక విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో నటించబోతున్న మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి కూడా చెప్పుకొచ్చారు.

  సన్నీ లియోన్‌ను బూతు సీన్లకు తావు లేకుండా సాంప్రదాయ బద్దంగా చూపిస్తామని మనోజ్ స్పష్టం చేసారు. ఒక పాటలో మాత్రం కాస్త హాట్‌గా చూపిస్తారట. ఈ చిత్రంలో మనోజ్ పాత్ర పల్లెటూరి అబ్బాయిగా రఫ్‌గా ఉంటుంది. టైటిల్‌కు తగిన విధంగా ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. జూన్ లో షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

  ఏ ప్రత్యేకత లేక పోవడమే ఈ పుట్టినరోజు ప్రత్యేకత

  ఏ ప్రత్యేకత లేక పోవడమే ఈ పుట్టినరోజు ప్రత్యేకత

  ఈ బర్త్ డే స్పెషలేంటి? అని చాలా మంది అడుగుతున్నారు. పర్టిక్యూలర్‌గా పుట్టినరోజు నాడు ఏదైనా ప్రత్యేకంగా చేయాలనేమీ నేననుకోను. రోజూ ఎలా ఉంటానో...ఆ రోజు కూడా అంతే. కాకపోతే...పుట్టినరోజు మాత్రం ఫ్రెండ్స్ అంతా కలుస్తాం. ముఖ్యంగా అదే రోజు జూ ఎన్టీఆర్ బర్త్ డే కూడా అవ్వడం వల్ల కుదిరితే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం.

  నా బెండు తీస్తున్నాడు

  నా బెండు తీస్తున్నాడు

  ఇప్పటి వరకు నేను పని చేసిన దర్శకుల్లో చంద్రశేఖర్ ఏలేటి, కె.రాఘవేంద్రరావు లాంటి ఇద్దరు ముగ్గురు దర్శకులు మినహా...ఎవరికీ కూడా డైరెక్షన్ పట్ల క్లారిటీ లేదు. కథగా చెప్పింది సినిమాగా తీయడంలో విఫలమయ్యేవారు. అయితే నాగేశ్వర్రెడ్డి శైలి ప్రత్యేకమైనది. సన్నివేశాన్ని వివరించినదానికంటే పదింతలు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సీన్ టు సీన్ ఫుల్ క్లారిటీ ఉన్న దర్శకుడాయన. రఫ్‌గా చెప్పాలంటే...నా బెండు తీస్తున్న దర్శకుడు నాగేశ్వర్రెడ్డి.

  సన్నీ లియోన్ సాంప్రదాయ బద్దంగా..

  సన్నీ లియోన్ సాంప్రదాయ బద్దంగా..

  కరెంటు తీగ చిత్రంలో పోర్న్ స్టార్ టర్న్‌డ్ హీరోయిన్ సన్నీ లియోన్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. సినిమాకి క్రేజ్ తీసుకురావడంతో పాటు క్యారెక్టర్‌కి కూడా యాప్ట్ కావడంతో ఆమెను తీసుకోవడం జరిగింది. అయితే సన్నీ లియోన్‌‌ను కరెంటు తీగ చిత్రంలో చాలా సాంప్రదాయ బద్దంగా చూపిస్తున్నాం. ఒక పాటకు మాత్రమే ఇందుకు మినహాయింపు. అది కూడా లేక పోతే సన్నీ ఫ్యాన్స్ చితక్కొడతారని..!

  మంచి టీం కుదిరింది

  మంచి టీం కుదిరింది

  ఇప్పటి వరకు నేను పని చేసిన చిత్రాలన్నింటిల్లో కరెంటు తీగ టీం బెస్ట్ గా ఉంది. దర్శకుడు జి నాగేశ్వర్రెడ్డి, సంగీత దర్శకుడు అచ్చు, హీరోయిన్ రకుల్, కెమెరామెన్, రైటర్...ఇలా అందరూ సినిమా పట్ల ఫ్యాషన్ ఉన్నవారే. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.

  ఎందులోనూ వేలు పెట్టడం లేదు

  ఎందులోనూ వేలు పెట్టడం లేదు

  ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో నటనతో పాటు మరిన్ని విభాగాల్లోనూ ఇన్ వాల్వ్ అయ్యేవాడ్ని. అయితే ఈ చిత్రంలో అలాంటివేమీ చేయడం లేదు.

  అన్నయ్య అన్యాయం చేస్తున్నాడు

  అన్నయ్య అన్యాయం చేస్తున్నాడు

  ఈ సినిమాకి మా అన్నయ్య మంచు విష్ణు నిర్మాత. అన్నగా నాతో ఎంత ఫ్రీగా ఉంటాడో...నిర్మాతగా అంతే స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడు. అలాగే నిర్మాణ విలువల విషయంలోనూ ఎక్కడా రాజీ పడటం లేదు. కానీ ఇప్పటి వరకు నాకు రెమ్యూనరేషన్ మాత్రం ఇవ్వలేదు. మీరే ఏదో ఒకటి చేసి నాకు డబ్బులు ఇప్పించండి ‘పెద్దగా నవ్వుతూ..)

  సన్నాఫ్ పెదరాయుడు ఇంకా స్ట్రిప్టు దశలోనే..

  సన్నాఫ్ పెదరాయుడు ఇంకా స్ట్రిప్టు దశలోనే..

  ‘కరెంట్ తీగ' తర్వాత నేను నటించబోయే సినిమా ఏది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ‘సన్నాఫ్ పెదరాయుడు' అనుకున్నాం కానీ ఆ సినిమా ఇంకా స్క్రిప్టు దశలోనే ఉంది. అలాగే మరో ప్రాజెక్టు కూడా.

  మేం మద్దతిచ్చిన మోడీ గెలవడం ఆనందం

  మేం మద్దతిచ్చిన మోడీ గెలవడం ఆనందం

  ఈ సార్వత్రిక ఎన్నికల్లో మా మంచు కుటుంబం సపోర్టు చేసిన పొలిటీషియన్ నరేంద్ర మోడీ. ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టబోతుండటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ముఖ్యమంత్రులు కాబోతున్న కేసీఆర్, చంద్రబాబులకు నా అభినందనలు.

  చిన్న వయసులో పెద్ద బాధ్యత మోయడం కష్టమే

  చిన్న వయసులో పెద్ద బాధ్యత మోయడం కష్టమే

  ప్రతి పుట్టనరోజు నాకు..అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. అయితే ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతలు మోసేందుకు నేను సిద్ధంగా లేను. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నేను కూడా పెద్ద చూపిన సంబంధాలకే మొగ్గు చూపుతున్నాను. నా మనసుకు నచ్చిన మెరుపుతీగ తారస పడితే అపుడు లవ్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తాను.

  English summary
  Manchu Manoj Kumar was born on 20 May 1983 to film actor Manchu Mohan Babu and Manchu Nirmala Devi. He has an elder sister Lakshmi Manchu and an elder brother Vishnu Manchu who are both Tollywood actors. He received his bachelors degree from Southeastern Oklahoma State University.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more