»   » మంచు మనోజ్ ‘శౌర్య’ అఫీషియల్ ట్రైలర్

మంచు మనోజ్ ‘శౌర్య’ అఫీషియల్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మనోజ్‌, రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై దశరథ్‌ దర్శకత్వంలో శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం ‘శౌర్య''. థ్రిల్లర్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, టీజర్స్ కు ఆడియెన్స నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వేదా.కె. సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 31 శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.


Manchu Manoj's Shourya audio release date

సినిమాలో మనోజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ లుక్ తో కనపడనున్నాడు. దర్శకుడు దశరథ్ కు ఉన్న క్లాస్ ఇమేజ్, మనోజ్ కు ఉన్న మాస్ ఇమేజ్, ఈ రెండింటి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిభ్రవరి రెండో వారంలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, షాయాజీషిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్‌, బెనర్జీ, జి.వి., ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, సత్యప్రకాష్‌,సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్‌, చంద్రకాంత్‌, రూప ఇతర తారాగణం. ఈ చిత్రానికి స్టంట్స్‌: వెంకట్‌, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్‌: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్‌, రచన: గోపి మోహన్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్‌ జోషి, నిర్మాత: శివకుమార్‌ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్‌.

English summary
Manchu Manoj's upcoming film Shourya audio releasing on Jan 31st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu