»   » మంచు మనోజ్‌ 'శౌర్య ' మోషన్ పోస్టర్ సాంగ్ (వీడియో)

మంచు మనోజ్‌ 'శౌర్య ' మోషన్ పోస్టర్ సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు మనోజ్‌ హీరోగా దశరథ్‌ దర్శకత్వంలో శౌర్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మనోజ్‌ సరసన రెజీనా నటిస్తోంది. మొన్నా మధ్య ఫస్ట్ లుక్ ని వదిలిన దర్శక,నిర్మాతలు ఈ సారి చిత్రం మోషన్ పోస్టర్ సాంగ్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ దాన్ని చూడవచ్చు.


సురక్షా ఎంటర్‌ టైన్మెంట్స్‌ ఇండియా ప్రై.లి. బ్యానర్‌పై ఈ కమర్షియల్‌ ఎంట ర్‌టైనర్‌ను శివకుమార్‌ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాది సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి. బ్యానర్‌పై విడుదలైన 'సూర్య వర్సెస్‌ సూర్య' సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాత శివకుమార్‌ మంచు మనోజ్‌ హీరోగా ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.


నిర్మాత శివకుమార్‌ మాట్లాడుతూ ''ఈ ఏడాది సూర్య వర్సెస్‌ సూర్య చిత్రాన్ని మా బ్యానర్‌లో నిర్మించి పెద్ద సక్సెస్‌ను సాధించాం. ప్రస్తుతం రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ హీరోగా సంతోషం, మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు దశరథ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు.


Manchu Manoj's Shourya Motion Poster Song

ఇందులో మనోజ్‌ కళ్లజోడు తో క్లాస్‌గా కనిపిస్తున్నాడు. దశరథ్‌ ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ని తయారు చేశారని, ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని మనోజ్‌ తెలియజేశారు.


ఇక మనోజ్‌ నుంచి మరోటి..పెళ్లయ్యాక మంచు మనోజ్‌ సినిమాల ఎంపికలో తన జోరు చూపిస్తున్నాడు. రామ్‌గోపాల్‌ వర్మ 'ఎటాక్‌'తో బిజీగా ఉన్న మనోజ్‌ ఇటీవలే జి.ఈశ్వర్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఇప్పుడు దశరథ్‌ సినిమాకీ మోషన్ పోస్టర్ వదిలేసాడు. ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కె.వేదా సంగీతమందిస్తున్నారు.

English summary
Motion Poster Song of Manchu Manoj's latest film Shourya released. Starring Manchu Manoj, Regina directed by Dasaradh and Produced By Shiva Kumar Malkapuram under the Banner Suraksh Entertainments India Pvt.Ltd
Please Wait while comments are loading...