»   » నా సినిమాకీ, కులానికి ముడి పెట్టొద్దు: మంచు మనోజ్

నా సినిమాకీ, కులానికి ముడి పెట్టొద్దు: మంచు మనోజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పొలిటికల్ గానే కాదు.... సినిమా రంగంలోనూ కులం ప్రభావం. ఆయా స్టార్ హీరోలకు ఉండే అభిమానుల్లో చాలా మంది వారి వారి కులం మద్దతు దారులే అనేది కాదనలేని సత్యం. కొన్ని రోజులుగా తెలుగునాట కుల రాజకీయాలు హాట్ హాట్ గా రన్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మంచు మనోజ్ నటించిన 'శౌర్య' సినిమా మూవీ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

మంచు మనోజ్ మాట్లాడుతూ 'శౌర్య' సినిమా మార్చి 4న విడుదలవుతుంది. రియల్ లైఫ్ లో శౌర్య అనే క్యారెక్టర్ ఉంటే అది దశరథ్ గారిలా ఉంటుంది. లవ్ థ్రిలర్. కమర్షియల్ ఫార్మేట్ లో ఉండే డిఫరెంట్ మూవీ. స్క్రీన్ ప్లే బేస్ డ్ మూవీ. రాజకీయాలు వేరు, సినిమా వేరు. సినిమాకు కులానికి ముడి పెట్టవద్దు. కులానికి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి. పైరసీని ఎంకరేజ్ చేయవద్దు'' అన్నారు.


Photos: Shourya Press Meet


బేబి త్రిష సమర్పణలో సురక్ష ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్ పై మంచు మనోజ్, రెజీనా జంటగా నటించిన చిత్రం 'శౌర్య'. కె.దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు మనోజ్, రెజీనా, దశరథ్, మల్కాపురం శివకుమార్, శివారెడ్డి, వేదా.కె తదితరులు పాల్గొన్నారు.


రెజీనా మాట్లాడుతూ ''ఈ సినిమాలో నేత్ర అనే క్యారెక్టర్ ను నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ సినిమాను రూపొందించారు. మనోజ్ ఉంటే సెట్ వాతావరణమే మారిపోతుంది. మంచి కోస్టార్. అందరినీ కలుపుకునే వ్యక్తి. మంచి టీంతో వర్క్ చేశాను. మా సినిమా మార్చి4న విడుదలవుతుంది. ఆదరిస్తారని నమ్మతున్నాను'' అన్నారు.


దర్శకుడు దశరథ్.కె మాట్లాడుతూ...

దర్శకుడు దశరథ్.కె మాట్లాడుతూ...

కాన్సెప్ట్ బేస్ డ్ మూవీ. ఇంట్రెస్టింగ్ గా సాగే కమర్షియల్ మూవీ. టీం సపోర్ట్ తో సినిమాను మార్చి 4న విడుదల చేస్తున్నాం. నిర్మాత సహా టీం అందరికీ థాంక్స్ అన్నారు.


నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ..

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ..

పాత్రలకు తగిన విధంగా నటీనటులను ఎంపిక చేసుకుని సినిమా చేశాం. మంచి టెక్నికల్ టీం కూడా కుదరడంతో మంచి సినిమాను తీయగలిగాను. ఇలాంటి టీంతో మళ్ళీ సినిమాలు చేయాలనిపిస్తుంది. మోహన్ బాబుగారు సినిమా చూసి మనోజ్ కొత్తగా చేశాడని, బ్యానర్ వాల్యూని పెంచే చిత్రమవుతుందని మెచ్చుకున్నారు. 900పైచిలుకు థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తున్నాం'' అన్నారు.


నటీనటులు

నటీనటులు

ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, షాయాజీషిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్‌, బెనర్జీ, జి.వి., ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, సత్యప్రకాష్‌,సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్‌, చంద్రకాంత్‌, రూప ఇతర తారాగణం.


తెరవెనక

తెరవెనక

ఈ చిత్రానికి స్టంట్స్‌: వెంకట్‌, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్‌: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్‌, రచన: గోపి మోహన్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్‌ జోషి, నిర్మాత: శివకుమార్‌ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్‌.


English summary
Shourya Movie Pre-Release Press Meet held at Hyderabad. Shourya release on 4 March. Manchu Manoj Kumar, Regina Cassandra, Dasarath, Malkapuram Shivakumar, Siva Reddy graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu