»   »  కొత్త స్టైల్ తో: మంచు మనోజ్‌, దశరథ్ చిత్రం ఫస్ట్ లుక్ (ఫొటో)

కొత్త స్టైల్ తో: మంచు మనోజ్‌, దశరథ్ చిత్రం ఫస్ట్ లుక్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా తొలి సినిమా నుంచి ప్రతీసారి మంచు మనోజ్ మాస్‌ లుక్‌తోనే కనిపిస్తుంటాడు. ఆయన యాక్షన్‌ ప్రాధాన్యమున్న చిత్రాలే చేస్తుంటారు కాబట్టి అందుకు తగ్గట్టుగానే మాస్‌ లుక్‌తో కనిపించేవాడు. కానీ ఇప్పుడు ఆయన అవతారం మారింది. క్లాస్‌గా సూటూబూటూ వేసుకొని కెమెరా ముందుకొచ్చాడు. మంచు మనోజ్‌ కథానాయకుడిగా దశరథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. మీరూ ఈ ఫస్ట్ లుక్ ని చూసి ఎలా ఉందో చెప్పండి

Here it is darlings.. Launching #Shourya First Look Posters :)

Posted by Manchu Manoj on 19 November 2015

హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో మనోజ్‌ కళ్లజోడు తో క్లాస్‌గా కనిపిస్తున్నాడు. దశరథ్‌ ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ని తయారు చేశారని, ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని మనోజ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో మనోజ్‌ సరసన రెజీనా నటిస్తోంది.

సురక్షా ఎంటర్‌ టైన్మెంట్స్‌ ఇండియా ప్రై.లి. బ్యానర్‌పై ఈ కమర్షియల్‌ ఎంట ర్‌టైనర్‌ను శివకుమార్‌ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాది సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి. బ్యానర్‌పై విడుదలైన 'సూర్య వర్సెస్‌ సూర్య' సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాత శివకుమార్‌ మంచు మనోజ్‌ హీరోగా ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

Manchu Manoj's Sourya Movie First loook

నిర్మాత శివకుమార్‌ మాట్లాడుతూ ''ఈ ఏడాది సూర్య వర్సెస్‌ సూర్య చిత్రాన్ని మా బ్యానర్‌లో నిర్మించి పెద్ద సక్సెస్‌ను సాధించాం. ప్రస్తుతం రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ హీరోగా సంతోషం, మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు దశరథ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు.

ఇక మనోజ్‌ నుంచి మరోటి..పెళ్లయ్యాక మంచు మనోజ్‌ సినిమాల ఎంపికలో తన జోరు చూపిస్తున్నాడు. రామ్‌గోపాల్‌ వర్మ 'ఎటాక్‌'తో బిజీగా ఉన్న మనోజ్‌ ఇటీవలే జి.ఈశ్వర్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఇప్పుడు దశరథ్‌ సినిమాకీ ఫస్ట్ లుక్ వదిలేసాడు. ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కె.వేదా సంగీతమందిస్తున్నారు.

English summary
Manchu Manoj's latest film with Dasarath first look released.
Please Wait while comments are loading...