For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎవడెవడు తొక్కేస్తున్నాడో తెలుసు, అన్నీ కక్కిస్తా: మంచు మనోజ్ సంచలన స్పీచ్

  By Bojja Kumar
  |

  మంచు మనోజ్ హీరోగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒక్క‌డు మిగిలాడు. ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌పై ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ ఆసక్తికర ప్రసంగం ఇచ్చారు.

  Okkadu Migiladu trailer
  భుజం, మెడ గాయాలున్నా కూడా...

  భుజం, మెడ గాయాలున్నా కూడా...

  దర్శకుడు కథ చెప్పగానే చాలా కదిలిపోయాను. ముందు లావెక్కాలి అన్నారు. తర్వాత తగ్గాలి అన్నారు. నాకు షోల్డర్ ఇంజురీ, నెక్ ఇంజురీ ఉంది. నా బాడీలో మజిల్స్ టైట్ గా ఉన్నంత సేపు నొప్పులు రావు, అవి లూజ్ అయిపోతే మళ్లీ నొప్పులు వస్తాయి. అయినా పర్వాలేదు అని స్టార్ట్ చేశాం. కానీ అంత లావు అయిన తర్వాత తగ్గడం అంత సులభం కాదు. ఇంత కష్టపడ్డాను కాబట్టే దర్శకుడిని నమ్మేసి బావిలో దూకేశాను. ఆయన హ్యాపీగా మా అందరినీ మెప్పించే విధంగా సినిమా తీశారు అని మనోజ్ తెలిపారు.

  వీడికి పెళ్లయి మారాడని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు

  వీడికి పెళ్లయి మారాడని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు

  డైరెక్టర్ అజయ్ ఆడ్రూస్ నూతక్కి మమ్మల్ని సినిమా సెట్లో అలా ఒక మూడ్ కి తీసుకెళ్లారు. సెట్లో కామెడీ లేదు, ఏమీ లేదు. రెండేళ్ల క్రితం ప్రెస్ వాళ్లుగానీ, మిత్రులుగానీ నన్ను చూస్తే ఎక్కడికెళ్లినా కౌంటర్లు వేసేవాడిని, అల్లరి చేసేవాడిని. అది మారింది. అందరూ అనుకుంటారు వీడికి పెళ్లయి మారాడని, కానీ ఈ డైరెక్టర్ వచ్చి నా జీవితాన్ని మార్చేశాడు. ఎందుకంటే 2 ఇయర్స్ నుండి అదే మూడ్లో ఉన్నాను... అని మనోజ్ చెప్పుకొచ్చారు.

  సాయం చేశావా? కడుపు కొట్టావా? అనే చూస్తారు

  సాయం చేశావా? కడుపు కొట్టావా? అనే చూస్తారు

  ఎంతో మనసు పెట్టి చేసిన సినిమా ఇది. దర్శకుడు దగ్గరుండి చూపిన ఆర్టికల్స్, వీడియోస్ నా మనసు కదిలించాయి. ఎంత కదిలిపోయిందంటే... మా నాన్నగారు మమ్మల్ని పెంచినపుడు కూడా స్ట్రేయిట్ ఫార్వర్డ్ గా ఉండాలి. కరెక్ట్‌గా ఉండాలి. పది మంది కడుపు కొట్టి వెళ్లకూడదు. నువ్వు జీవితంలో గెలిచావా, సూపర్ స్టార్ అయ్యావా, ఓడిపోయావా అని చూడరు. నువ్వు పది మందికి సాయం చేశావా? ఎవరి కడుపైనా కొట్టావా? అని చూస్తారు. అది మాత్రం చేయొద్దురా అనేవారు.... అని మంచు మనోజ్ గుర్తు చేసుకున్నారు.

  సంపాదనలో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే

  సంపాదనలో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే

  దేవుడు నాకు ఇచ్చినంత వరకు చాలా మంది పిల్లలను చదివిపించుకుంటున్నాను. నాకూడా ఉన్న వారిని చూసుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన కొద్ది ఇంకా హెల్ప్ చేసుకుంటూ వెళతాను. నాకు ఎంతో చేయాలని తపన. హుదూద్ అయినపుడు కానీ, చెన్నైలో వరదలొచ్చినపుడు గానీ ముందుంటాను. ఈ బ్రతుకు తీసుకున్నందుకు ఊరికే సంపాదించేసి అలా తీసుకోవడం కాదు. తీసుకుంది తిరిగి ఇవ్వాలి. నాకు సంబంధం లేకున్నా... ఫార్మర్స్ అంత ఇబ్బంది పడుతున్నారు. సంపాదించి అంతా ఏం చేస్తున్నాను అనే ఆలోచనలతో నా ప్రతి సినిమా నుండి 10శాతం ఫార్మర్స్ కు ఇస్తానని మాట ఇచ్చాను. అది జరుగుతుంది కూడా.... అని మనోజ్ తెలిపారు.

  అన్నీ వదిలేసి జనాల్లోకి వెళ్లిపోదాం అనుకున్నాను

  అన్నీ వదిలేసి జనాల్లోకి వెళ్లిపోదాం అనుకున్నాను

  నేను చాలా సెన్సిటివ్. పెద్ద వాళ్లు చిన్నవాళ్లను తొక్కడం ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉంది. అది ఆనవాయితీ అయిపోయింది. అది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఫార్మర్స్ చూస్తే ఆ ఇష్యూ ఉంది. మరొకటి చూస్తే మరో ఇష్యూ ఉంది. మా ఇండస్ట్రీని చూస్తే చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటే వాడి ప్రాణం పోతోంది. ఇవన్నీ సమస్యలు ఎందుకొస్తున్నాయి. అందరూ సమానం అంటున్నారు ఎందుకిలా జరుగుతుంది, ఆ ఉద్దేశ్యంతోనే బాధేసి బాధేసి ఛీ ఈ సినిమాలొద్దురా వెళ్లిపోదాం జనాల్లోకి అని డిసైడ్ చేసుకున్నాను. అలా అనుకుని ఆ రోజు ఆ ట్వీట్ చేయడం జరిగింది.... అని మనోజ్ తెలిపారు.

  ఎవరికీ చెప్పుకోలేదు

  ఎవరికీ చెప్పుకోలేదు


  నా మనసులోని ఆలోచన గురించి ఎవరికీ చెప్పుకోలేదు. ఏమని చెప్పుకుంటాం? నేను సమాజం మీదకు వెలుతున్నానురా... హెల్ప్ చేయమని అడిగితే హహహ అని నవ్వుతారు. మనందరికీ పది మందికి హెల్ప్ చేయాలనే అలవాటే పోయింది. అలవాటు పోయింది కాబట్టి పదిమందికి వెళ్లి హెల్ప్ చేయాలనుకున్నాను. ఇది వద్దనుకుని అటు వెలుతున్నాను. సినిమా అంటే నాకు ప్రాణం. నా ఊపిరి. నాకు చదువులేదు. సినిమా లేకుంటే మంచి కారు డ్రైవర్ అవుతాను. లేదా బాక్సర్ అవుతాను. అంతకంటే ఏమీ కాలేను..... అని మంచు మనోజ్ తెలిపారు.

  మా అన్నయ్య కంగారుపడి నా డాష్ మీద తన్నారు

  మా అన్నయ్య కంగారుపడి నా డాష్ మీద తన్నారు

  నేను అపుడు అలా చేయడంతో మా అన్న కంగారుపడిపోయి ఇంటికొచ్చి నా డాష్ మీద ఓ తన్ను తన్నారు. ఏంట్రా నీ సొంత డెసిషన్లు. ఇంత మంది ఉన్నాము. ఇలా చేస్తున్నావు అంటూ నా ఫోన్ లాక్కున్నారు. నా వైఫ్ గానీ, మా నాన్నగానీ మా ఇంట్లోగానీ ఒక్క మాట అనలేదు. మా నాన్నగారు అలా పెంచినదాని వల్లే వీడు ఇలా అయ్యాడని వారికి తెలుసు కాబట్టి వారు నన్ను అడగలేదు.... అని మనోజ్ తెలిపారు.

  విష్ణు అన్న చెప్పేది ఒకటే

  విష్ణు అన్న చెప్పేది ఒకటే

  విష్ణు అన్న అనేది ఒకటే. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. నువ్వు కొద్దిరోజులుగా ఎలాగో ఉన్నావని నాకు తెలుసు. ఇది మంచి ఉద్దేశ్యమే. లైఫ్ లో పది మందికి హెల్ప్ చేస్తావు. పైకి వస్తావు. అందుకనే నీ లైఫ్, నీ కెరీర్. కానీ పది రూపాయలు సంపాదిస్తేనే పది మందికి హెల్ప్ చేయగలుగుతావు. అది చూసుకుంటూ ఇది చేస్కో. ఒక రోజు సమయం వస్తుంది. ఆ రోజు మాట్లాడుదువురా అన్నారు. అన్నయ్య మాటకు మర్యాద ఇచ్చి సరే అని మళ్లీ ఒప్పుకోవడం జరిగింది....అని మంచు మనోజ్ అన్నారు.

  ఎవడెవడు తొక్కేస్తున్నాడో చూస్తున్నాను

  ఎవడెవడు తొక్కేస్తున్నాడో చూస్తున్నాను

  ఏదో ఒక రోజు నేను స్టార్ట్ చేసి వచ్చేస్తాను. వచ్చి ఆ రోజు డెఫనెట్‌గా ఈ రోజు ఎవరెవరు పైన కూర్చుని చిన్న వాళ్లను తొక్కుతున్నాడో, ప్రతి ఒక్కరినీ నా తల్లిదండ్రుల సాక్షిగా నోట్ చేసుకుంటున్నాను. తప్పకుండా వస్తా, ఆరోజు ఆడుగుతా. ప్రశ్నలు అడుగతాను. సమాధానం రెడీ చేసుకోండి. సమాధానం చెప్పలేరు కాదు... చెప్పిస్తా, కక్కిస్తా.... అంటూ మనోజ్ ఆవేశంగా మాట్లాడారు.

   అభిమానులకు థాంక్స్

  అభిమానులకు థాంక్స్

  నేను ఏ కోతి వేషాలు వేసినా, ఎలాంటి సినిమా తీసినా నా వెన్నంటే ఉంటూ, నన్ను కాపాడుకుంటూ, నన్ను డిసప్పాయింట్ చేయకుండా ముందుకు తీసుకెలుతున్న ఫ్యాన్స్ కి.... థాంక్స్. ఈ సినిమా ఒక దయనీయ గాథ, దయచేసి ఒక కమర్షియల్ సినిమాగానో, కామెడీ ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లొద్దు. ఫస్టాఫ్ రొమాలు నిక్కబొడిచే యాక్షన్. సెకండాఫ్ మనసులను కదిలించే ఒక బోట్ జర్నీ. దర్శకుడు ఎంతో అద్భుతంగా తీశాడు. ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

  English summary
  Manchu Manoj Impactful Speech impressed the audience at Okkadu Migiladu Pre Release Event. The movie Starring Manchu Manoj, Anisha Ambrose. Directed by Ajay Andrews, Music Composed by : Siva Nandigam. Produced By SN Reddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X