»   » స్వామివారి మొక్కు తీర్చుకున్న మంచు మనోజ్

స్వామివారి మొక్కు తీర్చుకున్న మంచు మనోజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుమల: ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన హీరో మంచు మనోజ్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దయతోనే ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు పాండవులు...పాండవులు తుమ్మెద సినిమా వస్తుందని ఆయన చెప్పారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో గాయపడి తాను త్వరగా కోలుకోవడంతో మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డుపై అప్పా వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సినీ నటుడు మోహన్‌బాబు కుమారుడు మనోజ్‌కు ఇటీవల స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు.

జూబ్లీహిల్స్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వెళ్తుండగా గేదె అడ్డుతగిలి కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న బెలూన్స్ తెరుచుకోవడంతో అందులోని మనోజ్‌తో పాటు డ్రైవర్, బాడీగార్డు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

English summary
Mohanbabu's son and cine actor Manch Manoj has visited Tirupathi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu