twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్‌ చేయకపోతే నేను చేస్తా: మంచు విష్ణు వర్ధన్

    By Srikanya
    |

    హైదరాబాద్ :''నాన్నగారు చేసిన సినిమాల్లో 'రాయలసీమ రామన్నచౌదరి' అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాని రీమేక్‌ చేయమంటే మాత్రం నేను వెనకడుగు వేస్తాను. ఎందుకంటే రజనీకాంత్‌, విష్ణువర్థన్‌ లాంటివాళ్లే ఆ సినిమాని మళ్లీ చేయడానికి భయపడ్డారు. ఇక నేనెంత? 'అసెంబ్లీ రౌడీ'ని మళ్లీ చేద్దామంటే నాకు, నాన్నకి పోలిక చూస్తారంటున్నారు. అయితే ఎవరి నటన వారిదే. ఎవరి శైలి వారిదే. వారసత్వంగా చరణ్‌ 'జగదేక వీరుడు...' సినిమా చేయకపోతే నేను ఆ సినిమా చేస్తాను అంటున్నారు మంచు విష్ణు వర్దన్. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం 'దూసుకెళ్తా'. ఈ సినిమా 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విష్ణు మంగళవారం మీడియాతో మాట్లాడారు.

    'దూసుకెళ్తా' గురించి చెప్తూ... ఏ పని చేయడానికైనా అతడు ముందుంటాడు. అయితే షరతులు వస్తాయి. ఇదేంటి ప్రకటనల్లోలాగా షరతులు అనుకుంటున్నారా? 'దేనికైనారెడీ' అనే తత్త్వం ఉన్న కుర్రాడు కదా. అందుకే 'దూసుకెళ్తా' అంటే షరతులు విధించారు. అయితే అవి మంచి కోసమే. అతడు పండించే వినోదానికి మాత్రం ఎలాంటి షరతులు ఉండవు. ఇలాంటి కుర్రాడు పరిశోధనాత్మక పాత్రికేయుడిగా సమాజం కోసం పని చేస్తున్నాడు. ఎలాంటి వారికి అలాగే బుద్ధి చెప్పే ఆ కుర్రాడి కథే మా సినిమా అన్నారు మంచు విష్ణు. ఈ 'దూసుకెళ్తా' చిత్రం నా పదేళ్ల సినీ జీవితాన్ని మరో పదేళ్లపాటు వేగంగా దూసుకెళ్లేలా చేస్తుందంటున్నారు.

    ఇక ''ఈ సినిమా కథని పూర్తిగా వినకుండానే నేను చేయడానికి అంగీకరించాను. దర్శకుడు వీరు పోట్ల మొదట తమ్ముడు మనోజ్‌కి కథ చెప్పాడు. ఆ తర్వాత నాన్న కూడా విన్నారు. వారిద్దరికి నచ్చి చేయమంటేనే నేను చేశాను. సినిమా చేస్తున్నన్ని రోజులు ఏదో ఓ భయం ఉండేది. సినిమా పూర్తయ్యాక నాన్నగారు, నన్ను అభిమానించే వారందరికీ చూపించాను. వాళ్ల స్పందన చూసిన తర్వాతే నాకు నిద్ర పట్టింది. ఈ సినిమాలో నన్ను, బ్రహ్మానందంగారిని చూసినవాళ్లు... నాన్నగారు, బ్రహ్మానందంగారి కాంబినేషన్‌ని గుర్తుకు తెచ్చుకున్నారు. దీంతోపాటు వెన్నెల కిషోర్‌ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాడు. అక్క లక్ష్మీ ప్రసన్న ప్రత్యేక పాత్రలో మురిపిస్తుంది. రవితేజ నేపథ్యగళం సినిమాకి అదనపు ఆకర్షణ'' అన్నారు.

    వీరు పోట్ల మాట్లాడుతూ ''రవితేజ గళంతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇందులో విష్ణు పాత్రికేయుడిగా కనిపిస్తారు''అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో రవితేజ గళం వినిపిస్తుంది. ఇందులో హీరో పాత్ర చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అవి ఆద్యంతం సరదాగా సాగుతాయి. ఆ సన్నివేశాలకి రవితేజ గళాన్ని అందించారు.

    వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురరి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆర్.విజయకుమార్.

    English summary
    Doosukeltha is an upcoming Telugu film directed by Veeru Potla starring Vishnu Manchu. Lavanya Tripathi, who made her debut with Andala Rakshasi, is the leading lady in the movie and Mani Sharma is composing the tunes. Dr. Mohan Babu is producing the film on the banner of 24 Frames Factory. Doosukeltha is touted to be a romantic entertainer. The film is set to release on October 17. Doosukeltha gets a U/A Certificate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X